ఈమధ్య కాలంలో తేలికగా డబ్బులు సంపాదించడం కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. పరువు, మర్యాదల గురించి ఆలోచించడం లేదు. ఆడవాళ్లు కూడా ఈ జాబితాలో చేరడం గమనార్హం. ఇక తాజాగా ఓ కిలేడి టీచర్ లీలలు వెలుగులోకి వచ్చాయి. ఆమె క్రిమినల్ మైండ్ సెట్ చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాలు..
పైన ఫ్యామిలీ గ్రూప్ ఫొటో చూసి ఎంత లక్షణంగా ఉన్నారు అని భ్రమ పడకండి. ఆ ఫొటోలో ఉన్న మహిళ చరిత్ర తెలిస్తే.. వామ్మో.. ఇంత భయకంరంగా ఉంటారా అనిపించకమానదు. ఫొటోలో ఇంత పద్దతిగా.. ఉండే ఈ మహిళ సోషల్ మీడియాలో మాత్రం పూర్తిగా మోడ్రన్ లుక్‌లో సందడి చేస్తుంది. ఆ ఫొటోలు చూసి ఎవరైనా ఆమె మీద మనసు పారేసుకుంటే.. ఇంక అంతే సంగతులు. వారిని పీల్చి పిప్పి చేస్తుంది. ఎదురుతిరిగితే.. చస్తానని.. లేదంటే చంపుతానని బెదిరిస్తుంది. తాజాగా ఆ కిలేడి మహిళ చేతిలో ఓ వ్యాపారవేత్త దారుణంగా మోసపోయాడు. భారీ ఎత్తున డబ్బులు పొగొట్టుకున్నాడు. ఆ మొత్తం తిరిగి చెల్లించమంటే.. ఆత్మహత్య చేసుకుంటాను.. లేదంటే నిన్నే పైకి పంపిస్తాను అని బెదిరిస్తోంది. దాంతో పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరో దారుణ అంశం ఏంటి అంటే.. సదరు మహిళ ఒక టీచర్. పంతులమ్మ అయి ఉంది ఇలాంటి పాడు పనులు ఏంటి అనుకుంటున్నారా.. ఆమె చరిత్ర పూర్తిగా తెలిస్తే.. కామెంట్స్ చేయడానికి మాటలు రావు. ఆ వివరాలు..
ఈ టీచర్ పేరు హాజిల్ జేమ్స్. కోయంబత్తూరు స్వస్థలం. ఈమెకు వివాహం అయ్యి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఇక మేడం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్. మోడ్రన్ డ్రెస్సులో రచ్చ చేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు 2020లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త రాజేష్‌తో పరిచయం ఏర్పడింది. అతడు సెంబూరు రైల్వే స్టేషన్‌లో ఓ ట్రావెల్ కంపెనీ నడిపేవాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి.. మంచి స్నేహితులయ్యారు. ప్రారంభంలో తనకు వివాహం కాలేదని చెప్పింది హాజిల్. కొన్నాళ్లు పోయాక తన భర్త మృతి చెందాడని చెప్పింది. అయ్యో పాపం అనుకున్నాడు రాజేష్. ఒంటరి మహిళ అనుకుని.. ఆమెకు దగ్గరయ్యాడు.
కొన్నాళ్లు గడిచాక మరో బాంబు పేల్చింది హాజిల్. తన భర్త ఉన్నాడని.. అయితే అతడి నుంచి విడిపోయానని.. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోందని చెప్పింది. అంతేకాక తనకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారని చెప్పుకొచ్చింది. అప్పటికే హాజిల్ మత్తులో మునిగిపోయిన రాజేష్.. వీటిని పట్టించుకోలేదు.. ఆమెకు దూరం కాలేదు. ఆమెను ఆదుకుంటాను అని మాటిచ్చాడు. ఈ క్రమంలో తొలిసారి తన తండ్రి చాలా కష్టాల్లో ఉన్నాడని.. తన జీతం డబ్బులే కుటుంబానికి ఆధారం అని చెప్పింది హాజిల్. దాంతో రాజేష్ ఆమెకు 90 వేల రూపాయలు ఇచ్చాడు. అది మొదలు ఏదో ఒక సాకు చెప్పి అతడి వద్ద నుంచి భారీగా డబ్బులు గుంజసాగింది హాజిల్.
అలా ఈ మూడేళ్లలో మొత్తం 20 లక్షల నగదు, ఖరీదైన మేకప్ సామాగ్రి, విలువైన ఫోన్లు కొనుగోలు చేయించింది. వీరి వ్యవహారం ఇలా సాగుతుండగా.. ఓ సంఘటనతో హాజిల్ నిజ స్వరూపం రాజేష్‌కి తెలిసింది. ఆమె ఓ ఆర్మీ అధికారితో రిలేషన్‌లో ఉందని గుర్తించాడు. ఆరా తీయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హాజిల్‌కు చాలా మంది మగాళ్లతో సంబంధం ఉందని వెల్లడయ్యింది. దీన్ని గురించి రాజేష్.. ఆమెను ప్రశ్నించగా.. నా వ్యక్తిగత వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నువ్వు ఎవరూ అని ప్రశ్నించింది. దాంతో రాజేష్ ఆమెతో బంధానికి స్వస్థి పలికాడు. తన డబ్బులు ఇవ్వాల్సిందిగా అడిగాడు. అందుకు హాజిల్.. డబ్బులు తిరిగి ఇవ్వమంటే.. తాను, తన ఇద్దరూ బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించింది. దాంతో భయపడ్డ రాజేష్.. కొంతకాలం పాటు కామ్‌గా ఉన్నాడు.
మరోసారి డబ్బుల గురించి అడగ్గా ఈ సారి రివర్స్‌లో అతడినే బెదిరించింది. ‘‘ఇంకో సారి డబ్బులు అడిగితే పైకి పంపిస్తాను. నీకు 20 లక్షలు ఇచ్చే బదులు.. 2 లక్షలు ఇచ్చి.. ఇద్దరు మనుషులను సెట్ చేస్తే.. వాళ్లు నిన్ను పైకి పంపిస్తారు.. ఈ గొడవ వదిలిపోతుంది’’ అని బెదిరించింది. లాభం లేదనుకున్న రాజేశ్.. పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. హాజిల్ ఓ పోలీసు అధికారి కొడుకును ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ ఇద్దరికి పడకపోవడంతో.. విడిపోయి వేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం వీరి విడాకులు కేసు కోర్టులో ఉంది.
హాజిల్ ప్రస్తుతం ఓ ఆర్మీ అధికారితో రిలేషన్‌లో ఉంది. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని భావిస్తోంది. అంతేకాక మొదటి భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు వెల్లడయ్యింది. హాజిల్ చరిత్ర తెలుసుకున్న పోలీసులు.. ఆమె మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.