ఈ మధ్యకాలంలో చిన్నచిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరీక్ష సరిగా రాయకపోయినా, తక్కువ మార్కులు వచ్చినా, పరీక్ష ఫెయిల్ అయినా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
ఇటీవల కాలంలో ఇంటర్ విద్యార్థులు ఎక్కువగా సూసైడ్‌కు పాల్పడుతున్నారు. పదవ తరగతి వరకు చదివిన విద్యార్థులు ఒకేసారి కాలేజ్‌కు వెళ్లాలన్నా, అక్కడ మింగిళవ్వాలన్నా కొంత సమయం పడుతుంది. వారికి పేరెంట్స్, కాలేజ్ యాజమాన్యం, సహ విద్యార్థులు తగిన తోడ్పాటునందించాలి. లేదంటే వారికి దిగులు, ఒంటరితనంతో మానసిక వేదనకు గురవుతారు. పిల్లలు అన్ని విషయాలలో సర్ధుబాటు కావడానికి టీనేజ్ కీలకం. అందుకే చాలామంది పిల్లలు అడ్జస్ట్ అవలేక బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. హాస్టల్‌లో ఉన్న విద్యార్థులకు కూడా కొందరు ఫ్యామిలీతో ఉండి హాస్టల్‌లో లోన్లీగా ఫీలవుతారు. ఏ నిర్ణయాన్నైనా సరిగ్గా తీసుకోలేక.. వారికి మంచి గైడెన్స్ ఇచ్చేవారు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చిన్ని చిన్న సమస్యలను పరిష్కరించుకోలేక ఇతరులకు తమ ఫీలింగ్స్ చెప్పలేక సతమతమవుతున్నారు. అలాగే ఈ రోజు ఉదయం హైదరాబాద్ బాచుపల్లిలో ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ శివారు బాచుపల్లి నారాయణ కాలేజ్‌లో విషాదం చోటుచేసుకుంది. నారాయణ కాలేజ్ భవనంపై నుంచి కిందపడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. విద్యార్థిని పేరు వంశిత, ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నట్లుగా గుర్తించారు. విద్యార్థిని మృతి అనుమానాస్పదంగా మారింది. విద్యార్థిని కామారెడ్డికి చెందిన రాగుల వంశితగా గుర్తించారు. వారం రోజుల క్రితమే ఇంటర్ ఫస్టియర్ గర్ల్స్ క్యాంపస్‌లో జాయిన్ అయ్యింది. ఈ రోజు ఉదయం వంశిత కాలేజ్ భవనం వెనక వైపు ఐదవ అంతస్తు మీది నుంచి పడి అనుమానాస్పదంగా చనిపోయి ఉంది. విషయం తెలిసిన కాలేజ్ మేనేజ్‌మెంట్ పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వంశితది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వంశిత తనే ఆత్మహత్య చేసుకుందా? లేదా ఎవరైనా తోసేశారా? అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.