ఉన్నత చదువులు పూర్తి చేసిన మధుబాబు .. 2012లో కానిస్టేబుల్ గా సెలక్టయ్యాడు. ఇక ఉద్యోగం రావడంతో అదే ఏడాదిలో Y యువతిని పెళ్లి కూడా చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవు. కానీ, ఆ కోరిక మాత్రం నెరవేరలేదు.
ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రతీ సమస్యకు పరిష్కారమే లేదన్నట్లుగా బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇటు చిన్న పిల్లల నుంచి అటు పెద్ద వయసు వారి వరకు.. అందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే ఓ కానిస్టేబుల్ సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అయితే అతడి ఆత్మహత్యకు కారణం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. అది తెలంగాణలోని నల్గొండ జిల్లా సూర్యాపేట పరిధిలోని దురాజ్ పల్లి. ఇదే గ్రామంలో మధుబాబు (39) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఉన్నత చదువులు పూర్తి చేసిన మధుబాబు .. 2012లో కానిస్టేబుల్ గా సెలక్టయ్యాడు. ఇక ఉద్యోగం రావడంతో అదే ఏడాదిలో కుమారి అనే యువతిని పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇక పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఎంతో సంతోషంగా కాపురాన్ని సాగించారు. అలా చాలా ఏళ్లు గడిచింది. కానీ, ఈ దంపతులకు పిల్లలు మాత్రం కలగలేదు.
దీంతో ఈ కారణంతోనే దంపతులు తరుచు బాధపడేవారట. పిల్లలు పుట్టకపోవడంతో నలుగురిలో తిరగడానికి కూడా ఇబ్బండిపడేవారని తెలుస్తుంది. అయితే ఇదే విషయంపై గత కొన్ని రోజుల నుంచి మధుబాబు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇదిలా ఉంటే ఈ నెల 7న మధుబాబు డ్యూటీకి వెళ్లి ఇంటికొచ్చాడు. ఆ తర్వాత మధుబాబు నేరుగా తమ పొలానికి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక పురుగుల మంతు తాగాడు. అనంతరం మధుబాబు తిరిగి మళ్లీ ఇంటికొచ్చాడు. ఈ విషయాన్ని మధుబాబు కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే హుటాహుటిన అతడిని హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఇక మెరుగైన వైద్యం అందించినా మధుబాబు కోలుకోలేకపోయాడు. అయితే చికిత్స పొందుతు మధుబాబు ఇటీవల ప్రాణాలు విడిచాడు. దీంతో మధుబాబు భార్య, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై మధుబాబు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అయితే పిల్లలు లేరని ఆత్మహత్య చేసుకుంటున్న ఇలాంటి వారికి మీరిచ్చే విలువైన సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి.