ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఉద్యోగరిత్యా చెన్నైలో ఉంటున్నాడు. దీంతో అప్పటి నుంచి ఆ మహిళ పుట్టింట్లోనే ఉంటూ పిల్లలను చదివించుకుంటుంది. అయితే ఉన్నట్టుండి ఈ మహిళ ఇలా చేయడంతో ఆమె భర్త, తల్లి ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అసలేం జరిగిందంటే?
పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు శాంతి. ఈమెకు 6 ఏళ్ల కిందటే ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఆమెకు ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక ఈ భార్యాభర్తల కాపురం సజావుగానే సాగుతూ వచ్చింది. అయితే ఉద్యోగరిత్యా భర్త గత కొంతకాలం నుంచి చెన్నైలో ఉంటున్నాడు. దీంతో అప్పటి నుంచి ఆ మహిళ తన తల్లి ఇంట్లోనే ఉంటుంది. కట్ చేస్తే ఉన్నట్టుండి కూతురు చేసిన పనికి శాంతి తల్లి ఒక్కసారిగా షాక్ గురైంది. అసలేం జరిగిందంటే?
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని చింతలబాజర్ కు చెందిన రేపన శాంతికి నాగార్జున సాగర్ కు చెందిన కృష్ణం రాజుతో 6 ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అలా కొన్నేళ్లకు ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇదిలా ఉంటే.. శాంతి భర్త కృష్ణం రాజు ఉద్యోగరిత్యా గత కొన్ని రోజులు నుంచి చెన్నైలో ఉంటున్నాడు. దీంతో అప్పటి నుంచి శాంతి తన పిల్లలతో పాటు పుట్టింట్లోనే తల్లి వద్దే ఉంటుంది. పిల్లలు కూడా అక్కడే చదువుకుంటున్నారు.
ఇకపోతే శాంతి గత కొన్ని రోజుల నుంచి తీవ్ర అనారోగ్యానికి గురై బాధపడుతూ ఉంది. ఇక భర్త భార్యకు దూరంగా ఉండడంతో ఆ బాధను ఎవరికి చెప్పుకోవాలో ఆమె తీవ్ర మనోవేదనకు గురైనట్టుగా సమాచారం. అయితే ఉన్నట్టుండి శాంతి శుక్రవారం తన పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇంట్లో కూతురు కనిపించకపోయే సరికి శాంతి తల్లి ఒక్కసారిగా షాక్ గురైంది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి స్థానిక ప్రాంతాల్లో గాలించారు. అయినా శాంతి ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక ఏం చేయాలో అర్థం కాక శాంతి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నపోలీసుల శాంతి, ఆమె పిల్లల ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఉన్నట్టుండి శాంతి కనిపించకపోవడంతో ఆమె తల్లి, భర్త శోకసంద్రంలో మునిగిపోయారు.