ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువయిపోయాయి. భార్యా భర్తల మధ్య బంధం అపహాస్యం అవుతోంది. కొంతమంది ఆడవారు, మగవారు దాంపత్య బంధాన్ని అపహాస్యం చేస్తున్నారు. అక్రమ సంబంధాల పేరిట దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా, ఓ మహిళ అక్రమ సంబంధాల మోజులో కట్టుకున్న భర్తను చంపేసింది. ఇద్దరు ప్రియుళ్ల సహాయంతో భర్తను చంపటమే కాకుండా భర్త శవాన్ని రైల్వే ట్రాక్‌పై పడేసింది. ఈ సంఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సూరత్‌కు చెందిన వినోద్ బల్‌దేవ్, పూనమ్ భార్యాభర్తలు. వీరికి పెళ్లయి ఏళ్లు గడుస్తోంది. పెళ్లయిన కొన్ని రోజులు సజావుగానే సాగిన వీరి కాపురం తర్వాతి కాలంలో గొడవలకు నెలవైంది.
భార్యాభర్తలు తరచుగా గొడవలు పడుతూ ఉండేవారు. దీనికి కారణం లేకపోలేదు. పూనమ్‌కు రాహుల్ గోలీ, సాగర్ గోలీలతో వివాహేతర సంబంధం ఉంది. ఈ సంబంధం విషయం వినోద్‌కు తెలిసింది. దీంతో గొడవలు మొదలయ్యాయి. తరచుగా ఇద్దరూ ఈ విషయంపై గొడవలు పడుతూ ఉండేవారు. డిసెంబర్ 17న కూడా ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. దీంతో పూనమ్ ఓ నిర్ణయానికి వచ్చింది. తన భర్తను చంపేసి, ప్రియుళ్లతో సంతోషంగా ఉండాలనుకుంది. ఇద్దరికీ ఈ విషయం చెప్పింది. ముగ్గురు కలిసి ఓ ప్లాన్ వేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ రాత్రి వినోద్ ఇంట్లో నిద్రపోతూ ఉన్నాడు.
ముగ్గురు కలిసి అతడి దగ్గరకు వెళ్లారు. గొంతు నులిమి చంపేశారు. అనంతరం శవాన్ని దిండోలీ ఏరియాలోని రైల్వే ట్రాకుపై పడేశారు. ఇలా చేస్తే రైలు ప్రమాదంగా భావిస్తారని అనుకున్నారు. అయితే, లోకో పైలట్ ట్రాకుపై పడేసిన శవాన్ని చూశాడు. రైలును ఆపేశాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూసింది. పోలీసులు నిందితులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు తాము చేసిన నేరాన్ని బయటపెట్టారు. మరి, అక్రమ సంబంధం కారణంగా భర్తను చంపిన భార్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.