ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు అనే సామెత బాగా ఒంటపట్టించుకున్న ఓ కానిస్టేబుల్ పోలీసు వాహనానే మద్యం బాటిళ్ల సరఫరా చేస్తున్నాడు. పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో మద్యం బాటిళ్లు సరఫరా చేసిన కానిస్టేబుల్ వ్యవహారంలో ఎస్ఐని బుక్కయ్యాడు. నల్లొండ జిల్లా వాడపల్లి పీఎస్ పెట్రోలింగ్ వాహనంలో రాత్రి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ మద్యం సీసాల పెట్టెలను ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు తరలించాడు.
పోలీసుల వాహనం కావడంతో సరిహద్దు చెక్ పోస్టుల వద్ద అధికారు తనిఖీలు చేయలేదు. గుంటూరు జిల్లాలోని దాచేపల్లి మండలం రామాపురం సమీపంలోని ముల్లుపొదల్లో మద్యం సీసాల పెట్టెలను దాచాడు. తిరిగి వాడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చి వాహనాన్ని పార్క్ చేశాడు. మరోసటి రోజు నరసరావుపేటకు చెందిన కోటేశ్వరరావుతో కలసి మద్యం బాటిళ్లు కారులో ఎక్కించుకున్నారు.
అటుగా వచ్చిన దాచేపల్లి పోలీసులు వారి వాహనాన్ని తనిఖీ చేయగా మద్యం బాటిళ్లు కనిపించాయి. పోలీసులు శ్రావణ్కుమార్ను అదుపులోకి తీసుకోగా కోటేశ్వరరావు పరారయ్యాడు. పోలీసులు శ్రావణ్కుమార్ను వివరాలు కనుక్కోగా తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ అని తెలిసి షాకయ్యారు. ఈ విషయంపై తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు పోలీసు వాహనంలో మద్యం తరలించారని పేర్కొన్నారు.
ఈ సంఘటనపై వాడపల్లి ఎస్ఐ డి.విజయకుమార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ రేంజ్ ఐజీ ఎన్.శివశంకర్రెడ్డి. ఆయన పర్యవేక్షణ లోపం కారణంగానే పోలీస్ వాహనంలో మద్యం తరలించాలని నిర్ధారిస్తూ ఎస్ఐని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఈ ఘటనలో గుంటూరు జిల్లాలోని దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి శ్రావణ్కుమార్ను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.