వరంగల్ జిల్లాలోని ఓ కాలేజీలో విద్యార్థుల మధ్య రేగిన వివాదం చినిగి చినిగి చంపుకునే స్థాయికి చేరుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లాలోని ఓ కాలేజీలో అర్ధరాత్రి తోటి స్నేహితుల మధ్య వివాదం రాజుకుంది. ఇక మాటా మాటా పెరిగి నలుగురు స్నేహితులు సంజయ్ అనే తోటి స్నేహితుడిని దారుణంగా కొట్టారు.
ఇక ఇంతటితో ఆగకుండా కాలేజీ భవనంపైకి ఎత్తుకెళ్లి కిందకు తోసేశారని తెలుస్తోంది. చికిత్స పోందుతూ సంజయ్ ఆస్పత్రిలో మరణించాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంజయ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంగా తేల్చారు పోలీసులు.