ఇప్పటి వరకు మనం గ్రీన్ ఛాలెంజ్ విన్నాం, ఫిట్ నెస్ ఛాలెంజ్ లు విన్నాం. ఇంకా చాలా రకాల ఛాలెంజ్ విన్నాం. కానీ ఎప్పుడైన లిప్ లాక్ ఛాలెంజ్ గురించి విన్నారా? లిప్ లాక్ ఛాలెంజ్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే. తాజాగా ఈ కిస్సింగ్ కాంపిటీషన్ కు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఇదే అంశం ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఈ ఛాలెంజ్ లో పాల్గొన్న విద్యార్థులు ఎవరనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది కర్ణాటకలోని మంగుళూరు పరిధిలోని ఓ ప్రముఖ కాలేజ్. ఇక్కడ చదువుతున్న కొందరు విద్యార్థులు చదువును పక్కనబెట్టి చిల్లర వేశాలు వేస్తున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా యువతి, యువకులు అంతా ఒక అపార్ట్ మెంట్ లో చేరి లిప్ లాక్ కాంపిటీషన్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో ఓ యువకుడు, యువతికి లిప్ లాక్ పెడుతూ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నారు. దీనిని పక్కనున్న మరికొంత మంది విద్యార్థులు వీడియోలు తీసి వాట్సాప్ లో ప్రచారం చేశారు.
ఇది కూడా చదవండి: భార్య అందాన్ని చూసి మురిసిపోయాడు! కానీ.. ఆమె మాత్రం ప్రియుడితో!
దీంతో ఆ వీడియెలు మెల్ల మెల్లగా సోషల్ మీడియాలో అడుగు పెట్టి అంతా షేక్ చేస్తున్నాయి. ఈ వీడియోలపై స్పందించిన విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజ్ యాజమాన్యంపై సీరియస్ ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఇక లిప్ లాక్ ఛాలెంజ్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొందరు అనుమానితులను అరెస్ట్ చేసి అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. తాజాగా ఈ లిప్ లాక్ ఛాలెంజ్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఈ కిస్సింగ్ కాంపిటీషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.