ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. మైనర్లు సైతం తుపాకీలతో రెచ్చిపోతున్నారు. కొంతమంది క్లాస్ రూమ్స్ లోకి తుపాకీలు తీసుకు వచ్చి తోటి విద్యార్థులను బెదిరిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. అక్రమ ఆయుధాలు కొనుగోలు చేసి దారుణ హత్యలకు పాల్పపడుతున్నారు. దారుణమైన విషయం ఏంటంటే అమెరికా లాంటి పెద్ద దేశాల్లో మైనర్లు కూడా గన్స్ తో రెచ్చిపోతున్నారు. ఓ ఏడో తరగతి చదువుతున్న బాలుడు తుపాకీతో కలకలం సృష్టించాడు. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 9 మంది అక్కడిక్కడే చనిపోయారు. ఈ దారుణ ఘటన సెర్బియా రాజధాని బెల్‌గ్రాడ్‌కు చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఏడో తరగతి చదువుతున్న ఓ 14 ఏళ్లు విద్యార్థి తుపాకీతో కలకలం సృష్టించాడు. ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలుడు తన టీచర్ పై క్లాస్ రూమ్ లోనే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అక్కడే ఉన్న మరికొంతమంది విద్యార్థులపై కాల్పులు జరిపాడు. అడ్డు వచ్చిన గార్డులపై సైతం కాల్పులు జరిపాడు. ఈ దారుణ ఘటన సెర్బియా రాజధాని బెల్ గ్రాడ్ లో వ్లాడిస్లావ్ రిబ్నికర్ ఎలిమెంటరీ స్కూల్ లో జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు సెక్యూరిటీ గార్డుతో పాటు ఎనిమిది మంది మరణించినట్లు సెర్బియా హూంమంత్రిత్వ శాఖ తెలిపింది. టీచర్ తో పాటు మరో ఆరుగురు పిల్లలు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
స్కూల్ లో కాల్పులు జరిగాయన్న సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడి వాతావరణం భీతావాహనంగా మారిపోయింది. కాల్పులు జరిపిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనతో పాఠశాలలో విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు. కాల్పులకు కారణం ఇంకా తెలియరాలేదని.. దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ప్రత్యక్షంగా చూసిన ఓ విద్యార్థి మాట్లాడుతూ.. మొదట ఆ విద్యార్థి టీచర్ పై కాల్పులు జరిపి.. తాను ఎంచుకన్న విద్యార్థులను మాత్రమే షూట్ చేస్తూ వచ్చాడని అన్నారు. ఒక్కసారిగా తుపాకీ శబ్ధం రావడంతో టీచర్లు, విద్యార్థులు క్లాస్ రూమ్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన కారణంగా చుట్టుపక్కల పాఠశాలలను మూసివేశారు.