వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో తాజాగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు భయంతో ఆ ట్రైన్ లోకి అందరినీ తోసుకుంటూ వచ్చాడు. ఇక వస్తూ వస్తూనే అందులో ఉన్న మరుగుదొడ్లోకి వెళ్లాడు. కొన్ని గంటలు గడిచినా ఆ యువకుడు అందులో నుంచి బయటకు మాత్రం రాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
వందేభారత్ ట్రైన్ లో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆ ట్రైన్ మరుగుదొడ్లోకి దూరిపోయాడు. చాలా సేపు అయినా అతడు అందులో నుంచి బయటకు రాలేకపోయాడు. ప్రయాణికులకు ఎందుకో అనుమానం వచ్చింది. దీంతో వెంటనే వందేభారత్ ట్రైన్ టీటీఈకు సమాచారం అందించారు. ఇక ఆ యువకుడిని బయటకు రావాలంటూ చాలా మంది బతిమాలాడారు. కానీ, ఆ యువకుడు ఎంతకూ బయటకు రాలేదు. ఇక చేసేదేం లేక ట్రైన్ అధికారులు ఆ డోర్ పగలగొట్టి అతడిని బయటకు లాగారు. ఇంతకు ఆ యువకుడు ట్రైన్ మరుగుదొడ్లోకి ఎందుకు దూరి గడియ పెట్టుకున్నాడో తెలుసా?
కేరళలోని వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో ఆదివారం ఓ యువకుడు వెళ్ళాడు. అతృతగా ప్రయాణికులు ఎవరూ చూడక ముందే అందులోని మరుగుదొడ్లోకి దూరిపోయాడు. ఆ తర్వాత లోపలి నుంచి గడియ పెట్టుకున్నాడు. ఇదంతా కొందరు ప్రయాణికులు గమనించారు. అయితే, చాలా సేపు అయినా ఆ యువకుడు ఆ బాత్రూం నుంచి బయటకు రాలేదు. దీంతో ప్రయాణికులకు అనుమానం రావడంతో వెంటనే ట్రైన్ టీటీఈకు సమాచారం అందించారు. అతడు అక్కడికి చేరుకుని అందులో నుంచి బయటకు రావాలంటూ ఆ యువకుడిని కోరారు. అతడు ఎంత పిలిచినా అస్సలు బయటకు రాలేదు. ఇక ఈ ఘటనపై ఆ ట్రైన్ లో మిగతా అధికారులు సైతం స్పందించారు. బయటకు రావాలంటూ అతడిని పిలిచారు.
ఇక మనోడు మాత్రం అస్సలు బయటకు రాలేదు. ఇక చేసేదేం లేక సిబ్బంది సాయంతో ఆ మరుగుదొడ్డి డోర్ పగలగొట్టి ఆ యువకుడిని బయటకు లాగారు. దీంతో అతడికి భయంతో ఒళ్లంత చెమటలు పట్టాయి. ఎందుకు లోపలి నుంచి గడియ పెట్టుకున్నావు? అసలేం జరిగిందని అతడిని ప్రశ్నించగా.. తనను కొంతమంది తరుముకుంటూ వచ్చారని, అందుకే అందులోకి దూరి గడియ పెట్టుకున్నానని భయంతో వివరించాడు. ఆ యువకుడు అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది.