రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గత కొంత కాలంగా గుట్టు చప్పుడు కాకుండా సీక్రెట్ గా కొంతమంది వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో వ్యభిచార ముఠాలు పోలీసులకు పట్టుబడిన విషయం మరువకముందే తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మరో కొన్ని జంటలు దొరికిపోయాయి. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళలతో పాటు విటులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఉన్న కొన్ని లాడ్జీల్లో స్థానిక పోలీసులు పక్కా సమాచారంతో బుధవారం లాడ్జీల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో స్థానిక రెండు లాడ్జీల్లో కొందరు గుట్టు చప్పుడు కాకుండా రాసలీలల్లో మునిగి తేలుతున్నారు. పోలీసుల రాకతో ఖంగుతిన్న విటులు, మహిళలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ దాడుల్లో ఐదుగురు జంటలు పట్టుబడ్డారు. అనంతరం పోలీసులు మరిన్ని లాడ్జీలపై దాడులు చేసినట్లు తెలిపారు. నిబంధనలు ఎవరు అతిక్రమించిన కఠిన చర్యలు తీసుకుంటామని లాడ్జీ నిర్వహకులను పోలీసులు హెచ్చరించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.