నేటి కాలంలొ మహిళలు, యువత క్షణికావేశంలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. భర్త కొత్త చీర కొనివ్వలేదని, తండ్రి మందలించాడని, పరీక్షలో ఫెయిల్ అయ్యానని చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి పరీక్షలో ఫెయిల్ అయ్యానని బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన సారా నేపాలి(27) ఎంఎస్సీ, బీఈడీ చదవింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన టెట్ అర్హత పరీక్షలకు నేపాలి కూడా హాజరైంది.
ఇటీవల ఆ పరీక్షకు సంబంధించి కీ కూడా విడుదల చేశారు. కానీ అందులో నేపాలికి ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో అప్పటి నుంచి నేపాలి బాధపడుతూ ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు, ఎవరికి చెప్పాలో తెలియలేదు. ఈ క్రమంలోనే ఆ యువతి తీవ్ర ఒత్తిడికి గురైంది. ఇక బతకలేనని.. డాడీ నన్ను క్షమించు.. నేను చనిపోతున్నా, నా చావుకి ఎవరూ కారణం కాదు అని సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు గది నుంచి ఎంతకు బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది.
తన గదిలోకి వెళ్లిచూడగా కూతురు ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఈ సీన్ ను చూసిన ఆ యువతి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కూతురు చేసిన పనితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షలో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్యకు పాల్పడ్డ ఈ యువతి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.