నేటి కాలంలో అమ్మాయిలు తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడిపోతున్నారు. యువతి ప్రేమకు ఒప్పుకోలేదని, తల్లిదండ్రులు ప్రేమకు నిరాకరించారని ఇలాంటి చిన్న చిన్న కారణాలతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ ఇంటర్ బాలిక ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా చలనంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం మన్నపేటకు చెందిన 17 ఏళ్ల దుంగ కరిష్మా బాలయోగి గురుకులంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే భవాని అనే పాఠశాల ఉపాధ్యాయురాలి దగ్గర సురేష్‌తో అనే వ్యక్తి కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల నుంచి కరిష్మాకు ఆ డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతోనే కొన్నాళ్లకి ఇద్దరూ ప్రేమించుకున్నారు. కాగా వీరి ప్రేమ వ్యవహారం ఉపాధ్యాయురాలు భవానీకి తెలియడంతో సురేష్‌ను డ్రైవర్‌గా తొలగించారు.
ఇది కూడా చదవండి: Konaseema: వైద్యం ముసుగులో పాడుపని.. 7వ తరగతి బాలికపై డాక్టర్ దారుణం!
దీంతో పాటు కరిష్మాని కూడా ఇంత చిన్న వయసులో ప్రేమలేంటి అంటూ తోటి స్నేహితుల ముందే బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో కరిష్మా తీవ్ర మనస్థాపానికి చెందింది. ఇక తట్టుకోలేక తరగతి గదిలోనే నా ఆత్మహత్యకు గురుకులం గానీ, వేరే ఎవరూ గానీ కారణం కాదంటూ సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషయం తెలుసుకున్న గురుకులం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ విషయం తెలియడంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.