అనుమానం.. ఇదే కాపురాలను విడగొట్టడమే కాకుండా నిండు ప్రాణాలు సైతం తీసేస్తుంది. అసలైన నిజాలు ఏంటో తెలుసుకోకుండా కొందరు అనుమానంతో దేనికైన తెగిస్తున్నారు. ఈ కారణంతోనే చివరికి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ భర్త, అత్తమామలు కోడలిని దారుణంగా హత్య చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కంచిలి మండలం పద్మతుల. ఇదే గ్రామానికి చెందిన పుట్ట శ్రీను, పుష్ప భార్యాభర్తలు. 11 ఏళ్ల కిందట వివాహం జరగగ ముగ్గురు పిల్లలు జన్మించారు. ఇక భర్త ఆర్మీలో ఉద్యోగం చేస్తుండగా భార్య ఇంటి వద్దే ఉంటూ పిల్లలను చూసుకునేది. అయితే భర్త ఆర్మీలో ఉద్యోగం చేస్తుండడంతో భార్యపై అనుమానం ఉండేది. పుష్ప ఎవరితో ఫోన్లో మాట్లాడుతుందనే అనుమానం బలపడి ఇంటికి వచ్చి భార్యను అనుమానంతో వేధించేవాడు. దీంతో ఇదే విషయమై గతంలో వీరి గొడవ స్టేషన్ వరకు వెళ్లింది. అప్పటి నుంచి భార్య అత్తింటికి దూరంగా ఉంటూ ఉండేది.
ఇది కూడా చదవండి: స్టూడెంట్స్ లిప్ లాక్ ఛాలెంజ్.. ముద్దులతో రెచ్చిపోయిన విద్యార్థులు! వీడియో వైరల్!