ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా... భర్తను కాదని అతడి స్నేహితుడి మనసు పడింది. కొంత కాలం పాటు భర్తకు తెలియకుండా ప్రియుడితో సరసాలకు దిగింది. కట్ చేస్తే చివరికి ఊహించని దారుణానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?
ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా సరే భర్తను కాదని పరాయి మగాడితో సరసాలకు దిగింది. అంతేకాకుండా భర్తకు తెలియకుండా ఈ వ్యవహారాన్నంతా గత కొన్నేళ్లుగా నడిపించింది. అయితే ఇటీవల భార్య సాగిస్తున్న చీకటి కాపురం భర్త చెవిన పడింది. ఇక కోపంతో ఊగిపోయిన భర్త… భార్యను మందలించాడు. దీంతో అప్పటి నుంచి భార్య ప్రియుడిని మరిచిపోలేక, భర్తతో ఉండలేక చివరికి అనుకున్నది సాధించింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. అది ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం వరిశాం గ్రామం. ఇక్కడే నివాసం ఉంటున్న జీరు బాలకృష్ణ (36) అనే వ్యక్తి గత 13 ఏళ్ల కిందట ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన చాలా ఏళ్ల పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అలా కొన్నేళ్ల తర్వాత వీరికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. అయితే భర్త పెయింటింగ్ పనికి వెళ్తుండగా, భార్య గ్రామంలో చిన్న చిన్న పనులకు వెళ్తూ ఉండేది. ఈ క్రమంలోనే బాలకృష్ణ భార్య అతని స్నేహితుడైన వెంకటరమణపై మోజు పడి గత కొంత కాలంగా అతనితో తెర వెనుక సంసారాన్ని నడిపిస్తూ వచ్చింది.
ఈ విషయం కొన్నాళ్ల తర్వాత భర్తకు తెలియడంతో భార్యను గట్టిగా మందలించాడు. దీంతో భార్యకు భర్తతో కన్న ప్రియుడితో ఉండేందుకు ఇష్టపడింది. ఆ సమయంలో ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఫైనల్ గా బాలకృష్ణ భార్య ఓ నిర్ణయానికి వచ్చింది. అదే.. తన భర్తను చంపడం. ఇదే విషయాన్ని ఆ మహిళ తన ప్రియుడైన వెంకట రమణకు తెలియజేసింది. దీంతో ఆమె ప్రియుడు కూడా సరేనన్నాడు. ఇక ఇంకేముంది.. ఇద్దరూ కలిసి బాలకృష్ణ హత్యకు ప్లాన్ గీశారు. ఇందులో భాగంగానే ఆదివారం వెంకట రమణ తన స్నేహితులు కొందరు కలిసి పార్టీ చేసుకుందామని బాలకృష్ణకు చెప్పాడు. దీనికి బాలకృష్ణ కూడా సరేన్నాడు.
ఇక అందరూ కలిసి ఆదివారం రాత్రి 10 గంటల వరకు ఊళ్లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో మద్యం సేవించారు. అనంతరం వెంకట రమణ అతని స్నేహితులతో కలిసి బాలకృష్ణపై దాడికి దిగారు. వీరి దాడిలో బాలకృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత అందరూ కలిసి అతడి మృతదేహాన్ని అక్కడే ఉన్న చెట్ల పొదాల్లో విసిరేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఉదయం కొందరు స్థానికులు బాలకృష్ణ మృతదేహాన్ని గమనించి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భర్తను ఆ స్థితిలో చూసిన బాలకృష్ణ భార్య.. రాక్షస ప్రేమను చూపిస్తూ మొసలి కన్నీరు కార్చింది.
అనంతరం ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు.. ఎట్టకేలకు నిందితులైన బాలకృష్ణ భార్యతో పాటు ఆమె ప్రియుడు వెంకట రమణ అతని స్నేహితులను అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ప్రియుడిపై మోజుతో భర్తను అంతమొందించిన ఈ కసాయి భార్య దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.