భర్త మరణించడంతో మగతోడు కోసం ఎదురు చూస్తున్న ఆమె, కట్టుకున్న భార్యను కాదని ఆయన. ఇలా తమ సొంత కాపురాలను వదిలి పరాయి సుఖం కోసం ఆరాటపడ్డారు. ఒకరికొకరికి ఏర్పడిన పరిచయంతోనే కలిసి జీవించాలనుకున్నారు, ఒక్కటవ్వాలనుకున్నారు. కానీ సమాజం వీరి వ్యవహారాన్ని అంగీరించలేదు. దీంతో కన్నవాళ్లను, కట్టుకున్నవాళ్లను కాదని చివరికి పుట్టిన పిల్లలను సైతం అనాధలను చేసి ప్రాణాలతో లేకుండా పోయారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలానికి చెందిన సీతమ్మ(32)కు పెళ్లై ఇద్దరు ఓ కుమారుడు ఉన్నాడు. అనారోగ్య కారణాలతో భర్త 2013లోనే మరణించాడు. దీంతో అప్పటి నుంచి సీతమ్మ అక్కడక్కడ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకుంటు వస్తుంది. ఈ క్రమంలోనే సీతమ్మకు అల్లివలస గ్రామానికి చెందిన అమ్మోరు (30) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అమ్మోరుకు సైతం పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక వీరిద్దరి పరిచయమే చివరికి వివాహేతర సంబంధానికి దారి తీసింది. సీతమ్మకు భర్త లేకపోవడంతో ప్రియుడితో కలిసి తిరిగింది. దీంతో అప్పటి నుంచి ఇద్దరు మొగుడు, పెళ్లాం అనే విధంగా కలిసి తిరిగేవారు. ఈ విషయం తెలుసుకున్న సీతమ్మ తల్లిదండ్రులు ఆమెను మందలించి ఇదేం పనంటూ కోప్పడ్డారు. వీరి వ్యవహారం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇద్దరు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.
ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి అమ్మోరు సీతమ్మకు ఇంటికి వచ్చాడు. రాత్రంత ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.., తెల్లారేసరికి ఇద్దరు విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న సీతమ్మ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. స్థానికులు అంత ఈ సీన్ ను చూసి ఉలిక్కిపడ్డారు. అనంతరం ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఇక సీతమ్మ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. వీరి వ్యవహారం ఇరువురి కుటుంబాలకు ఇష్టం లేని కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.