ఆమెకు 2011లో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. అప్పటి నుంచి ఆమె భర్త రాక్షసుడిలా మారాడు. అలా చేయాలంటూ ఒత్తిడి చేశాడు. మరో దారుణం ఏంటంటే?
ఆమె పేరు యశోద. 2011లో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొన్నేళ్ల పాటు భర్త బాగానే సంసారం చేశాడు. కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. ఇక భర్త స్థానికంగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. అయితే.. రాను రాను భర్త అసలు రూపం బయటపడింది. అలా చేయాలంటూ రోజూ భార్యను టార్చర్ పెట్టేవాడు. దీనికి యశోద అత్తింటి కుటుంబ సభ్యులు కూడా వత్తాసు పలికినట్లు సమాచారం. ఇక భర్త వేధింపులు తట్టులేకపోయిన ఆ మహిళ.. పోలీసుల ముందు వివరిస్తూ కన్నీళ్లు కార్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం జయరామచంద్రపురం గ్రామం. ఇక్కడే యశోద (30)-నాగార్జున దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 2011లో వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అలా కొంత కాలానికి ఈ భార్యాభర్తలకు ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. అలా కొన్నేళ్లు గడిచింది. ఇక రాను రాను భర్త నాగార్జున భార్యను వేధించడం మొదలు పెట్టాడు. ఇద్దరినీ ఆడ పిల్లలనే కన్నవంటూ భార్యను టార్చర్ పెట్టేవాడు. అంతేకాకుండా విడాకులు ఇస్తే మరో పెళ్లి చేసుకుంటానని కూడా ఒత్తిడి తెచ్చేవాడు.
దీనికి యశోద మాత్రం నిరాకరిస్తూ వచ్చింది. భర్త మరింత రెచ్చిపోయి భార్యను వేధింపులకు గురి చేసేవాడు. తట్టుకోలేని ఆ మహిళ తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చి అక్కడే ఉంటుంది. అయితే ఈ నెల 9న ఆమె భర్త నాగార్జునతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు మాస్కులు ధరించి నాపై ఇనుప రాడ్ తో దాడి చేయబోయారని ఆ మహిళ వాపోయింది. ఇక భర్త దారుణాన్ని తట్టుకోలేని ఆ మహిళ ఏప్రిల్ 9న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. విడాకులు ఇవ్వాలని భార్యపై ఒత్తిడి తెస్తూ దాడి చేయబోయిన ఈ రాక్షసుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.