ఇద్దరిదీ ఒకే ఊరు. ఒకరినొకరు నచ్చుకోవడంతో పెద్ద సమక్షంలో ఘనంగా పెళ్లి జరిగింది. భర్త ఆర్మీలో ఉద్యోగం కావడంతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వీరి కాపురం సంతోషంగా సాగింది. కట్ చేస్తే.. ఉన్నట్టుండి అనారోగ్యంతో భార్య మరణించింది. భార్య లేదు, ఇక రాదన్న విషయాన్ని తట్టుకోలేక భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఒకరినొకరు నచ్చుకున్నారు. పెద్దల సమక్షంలో కలిసి ఏడడుగులు వేశారు. పెళ్లైన నాటి నుంచి ఎలాంటి గొడవలు, మనస్పర్థలు లేకుండా ఎంతో సంతోషంగా కాపురాన్ని సాగించారు. అలా కొన్ని నెలలు గడిచింది. అనారోగ్యంతో భార్య ఆస్పత్రి పాలైంది. ఆరోగ్యంతో తిరిగి ఇంటికి రావాలని భర్త ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాడు. కానీ, అతని భార్య ఆరోగ్యం అంతకంతకు క్షీణించడంతో ఇటీవల ప్రాణాలు వదిలింది. భార్య మరణంతో భర్త గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఇక నీవు లేక నేను లేనంటూ చివరికి భర్త కూడా భార్య వద్దకే వెళ్లిపోయాడు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథకం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం ఈసర్లపేట గ్రామం. ఇక్కడే మంగరాజు-మౌనిక దంపతులు నివాసం ఉంటున్నాడు. వీరికి 2022లో వివాహం జరిగింది. భర్త ఆర్మీలో ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతుండేవాడు. అలా పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల మధ్య ఎలాంటి గొడవలు, మనస్పర్థలు లేకుండా సంతోషంగా కాపురాన్ని సాగించారు. ఈ చూడముచ్చటైన జంటను చూసి ఇరువురి తల్లిదండ్రులు ఎంతో సంభరపడ్డారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో భార్య మౌనిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో భర్త మంగరాజు లక్షలు ఖర్చు పెట్టి ఆస్పత్రిలో చూపించాడు. ఇక రోజు రోజుకు మౌనిక ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆ మహిళను బతికించడానికి వైద్యులు సైతం ఎంతో కష్టపడ్డారు. కానీ, ఫలితం లేకపోవడంతో మౌనిక ఈ నెల 16న ఆస్పత్రిలోనే కన్నుమూసింది.
భార్య మరణంతో భర్త తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. పెళ్లైన ఏడాదిలోపే భార్య మరణించడంతో గుండెలు పగిలేలా ఏడ్చాడు. అలా మూడు రోజులు గడిచింది. మంగరాజు తరుచు భార్య గురించే ఆలోచిస్తూ భోజనం చేయడమే మానేశాడు. అయితే ఈ నెల 19న ఆస్పత్రికి వెళ్తున్నానని మంగరాజు ఇంట్లో చెప్పి పొందూరుకు వెళ్లాడు. అక్కడికి వెళ్లాక నేను చనిపోతున్నానని ఫ్రెండ్స్ కు మెసేజ్ చేసి స్థానికంగా ఉన్న తోటలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.