సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఇద్దరు ప్రభుత్వ అధికారులు ప్రేమ పేరుతో దారి తప్పారు. కట్టుకున్న భార్యను కాదని ఆయన, తాళికట్టిన భర్తను కాదని ఆమె. ఇలా ఇద్దరూ కుటుంబాలను వదిలేసి ప్రేమ పేరుతో దగ్గరై వివాహేతర సంబంధానికి పావులు కదిపారు. ఇలా సొంత కుటుంబాలను గాలికొదిలేసి పడక సుఖం పంతం నెగ్గించుకుంటున్నారు. వీరిద్దరి తప్పిదం వల్ల రెండు కుంటుంబాలను రోడ్డున పడ్డాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీసత్యసాయి జిల్లా కొత్త చెరవు మండలం కొడపగానిపల్లికి చెందిన రామ్మోహన్ అనే వ్యక్తి ఇదే గ్రామానికి చెందిన మమతను 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
రామ్మోహన్ పుట్టపర్తి మండలంలోని ఓ గ్రామంలో వీఆర్ఓగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొన్నాళ్లకి ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు కూడా జన్మించారు. రామ్మోహన్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో వీరి కాపురం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతూ ఉండేది. ఈ క్రమంలోనే దారి తప్పిన రామ్మోహన్ సచివాలయంలో పని చేస్తున్న ఓ వివాహితకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. రాను రాను వీరి మధ్య బంధం బలపడింది. దీంతో ఇద్దరు కుటుంబాలను కాదని వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bengaluru: అందమైన భార్యను కాదని పక్కచూపులు చూశాడు.. చివరికి విషాదం ఏంటంటే?
ఈ విషయం బయటకు పొక్కడంతో రామ్మోహన్ భార్య మమత పోలీసులకు సమాచారం అందించింది. ఈ నేపథ్యంలోనే రామ్మోహన్ తన భార్యను, పిల్లలను వదులుకుని ప్రియురాలికి దగ్గరవుదామనుకున్నాడు. ఇక ఇదే కాకుండా రామ్మోహన్ భార్యతో విడాకులకు కూడా సిద్దమయ్యాడు. పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించకపోవడంతో మమత స్పందన కార్యక్రమంలో తన గోడును వెల్లబోసుకుంది. ఎలాగైన నా భర్తకు కౌన్స్ లింగ్ ఇచ్చి నాకు న్యాయం చేయాలంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనలో రామ్మోహన్ కు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.