భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజం. కానీ కూర్చుని మాట్లాడుకుంటే సమిసిపోయే ఈ గొడవలను కొందరు దంపతులు పెద్దవి చేసుకుంటున్నారు. గోరుతో పోయేదాన్ని గొడ్డలిదాక తెచ్చుకుని చివరికి క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. సరిగ్గా ఇలాగే హద్దులు దాటి ప్రవర్తించిన ఓ భర్త చివరికి భార్య చేతిలో హతమయ్యాడు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? హత్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి పరిధిలోని మంచెపల్లి గ్రామం. ఇక్కడే బోయి ఆంజనేయులు, రాధమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లి అనంతరం వీరికి ఓ కూతురు, కుమారుడు జన్మించారు. అయితే చాలా ఏళ్ల పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉంటూ సంసారాన్ని ఈడ్చుకొచ్చారు. ఇదిలా ఉంటే భర్త ఆంజనేయులు గత కొన్ని రోజుల నుంచి తరుయు భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ శుక్రవారం రాత్రి కూడా ఆంజనేయులు భార్యతో గొడవ పడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక కోపంతో ఊగిపోయిన భర్త చంపేస్తానంటూ భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో భార్యపై దాడి కూడా చేయబోయాడు.
ఇక భయంతో వణికిపోయిన భార్య రాధమ్మ.. అక్కడున్న కర్రతో భర్త తలపై బలంగా దాడి చేసింది. ఈ దాడిలో భర్త అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో ఆంజనేయులు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురై శోక సంద్రంలో మునిగిపోయారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులు నిందితురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనలో భార్య చేసింది ఎంత వరకు కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.