ఆ యువతి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. దీంతో ఓ యువకుడు ప్రేమిస్తున్నానని ఈ అమ్మాయి వెంటపడ్డాడు. ఇక ఆమెకు ఎవరూ లేకపోవడంతో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. కానీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు, నువ్వే నా ప్రాణం అన్నాడు. ఇదంతా నిజమే అని నమ్మిన ఆ యువతి… పూర్తిగా అతగాడి మాయలో పడిపోయి అతనితో ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇద్దరు కొంత కాలం పాటు ప్రేమ విహారంలో తెలియాడారు. ఆ యువతి కూడా అతడిని పిచ్చిగా ప్రేమించింది. ఇక ఎలాగైనా ప్రేమించినవాడినే పెళ్లి చేసుకోవాలని భావించింది. కానీ, చివరికి ఇలా జరుగుతుందని తెలియక ఆ యువతి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాలోని రొంపుల గ్రామంలో చడ్డా సత్యశ్రీ (20) అనే యువతి నివాసం ఉంటుంది. ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఈమె చిన్న వయసులోనే చనిపోయారు. దీంతో అప్పటి నుంచి సత్యశ్రీ ఇదే గ్రామానికి చెందిన గిరి ప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో నివాసం ఉంటుంది. అయితే ఈ యువతి చదువుకుంటున్న రోజుల్లో కొయ్యూరు మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన సాగర్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఈ పరిచయంతోనే సాగర్.. నిన్ను ప్రేమిస్తున్నాని, నువ్వంటే ప్రాణం అని సత్యశ్రీని నమ్మించాడు.
ఇక ఇదంతా నిజమేనని నమ్మిన సత్యశ్రీ.. సాగర్ తో ప్రేమకు అంగీకరించింది. అలా ఇద్దరూ మూడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. కలిసి సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. ఇక సత్యశ్రీ ఎలాగైన సాగర్ నే వివాహం చేసుకోవాలని బలంగా అనుకుంది. కానీ, ఈ క్రమంలోనే సాగర్.. సత్యశ్రీకి తెలియకుండా మరో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు తట్టుకోలేకపోయింది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రియుడే ఇలా చేయడంతో కన్నీరు మున్నీరుగా విలపించింది.
తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువతి.. నా చావుకి సాగర్ అనే యువకుడు కారణం, నన్ను నమ్మించి మోసం చేశాడు అంటూ ఓ లేఖ రాసి గురువారం ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.