దేశంలో అత్యాచార దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ బరితెగించి అమ్మాయిలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
దేశంలో దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఊరు, వాడ, పట్టణం, నగరం ఇలా అన్ని చోట్ల అమ్మాయిలపై అత్యాచార దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు నిర్భయ, దిశ వంటి చట్టాలు రూపొందించినా దుర్మార్గుల ఆలోచనల్లో మాత్రం మార్పు రావడం లేదు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా ఏపీలో చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికపై ఓ యువకుడు బలవంతంగా అత్యాచారయాత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని పొట్టి శ్రీరాములు జిల్లా సంగం మండలంలోని ఓగ్రామం. ఇక్కడే ఓ 15 బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే తాజాగా ఆ బాలిక గ్రామంలోని దుకాణానికి వెళ్లింది. ఇక తిరిగి ఇంటికి వస్తుండగా రమేష్ అనే యువకుడు ఆ బాలికను అడ్డిగించాడు. అంతేకాకుండా ఆ బాలికపై అక్కడక్కడ చేతులేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో పాటు ఆ బాలికను బలవంతంగా బైక్ పై ఎక్కించుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఆ బాలిక చాకచక్యంగా అతడి నుంచి తప్పించుకుని పరుగు పరుగునా ఇంటికి చేరుకుని జరిగిందంతా తన తల్లిదండ్రులకు వివరించింది. కోపంతో ఊగిపోయిన ఆ బాలిక తల్లిదండ్రులు వెంటనే ఆ యువకుడని ప్రశ్నించగా ఆ బాలిక తల్లిదండ్రులపై సైతం దాడికి దిగినట్లు సమాచారం. అనంతరం బాధిత బాలిక తల్లిదండ్రులు ఆ యువకుడిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.