పోలీసులు ఎప్పుడైనా పోలీసులని లాకప్ లో వేయడం చూశారా? ఇలాంటి సిత్రాలు సినిమాల్లో జరుగుతాయి గానీ బయట జరిగే ఛాన్స్ చాలా తక్కువ. కానీ ఒక పోలీస్ మాత్రం తన కింద పని చేసే పోలీసులని లాకప్ లో వేసి తాళం పెట్టాడు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బీహార్ లోని నవాడా పోలీస్ స్టేషన్ కి ఎస్పీ గౌరవ్ మంగళ తనిఖీ చేయడానికి వెళ్లారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో స్టేషన్ కి వెళ్లి పోలీసుల తీరుని గమనించారు. అయితే అక్కడ విధుల విషయంలో ఐదుగురు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో వారిని లాకప్ లో పెట్టాడు. ముగ్గురు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లను దాదాపు 2 గంటల పాటు లాకప్ లో ఉంచాడు.
లాకప్ లో ఉన్న సీసీ కెమెరాలో ఐదుగురు పోలీసులు బందీగా ఉన్న విజువల్స్ బయటకు రావడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది చూసిన బీహార్ పోలీస్ అసోసియేషన్ ఎస్పీ తీరుని తీవ్రంగా పరిగణించింది. ఎస్పీని అడుగగా.. అదంతా ఫేక్ అని కొట్టిపడేశారు. అయితే ఐదుగురి పోలీసులపై ఓ కేసు విషయంలో కావాలనే ఎస్పీ ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు వచ్చినట్లు బీహార్ పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మృత్యుంజయ కుమార్ సింగ్ తెలిపారు. ఎస్పీపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోరారు. కాగా ఈ ఘటనపై బీహార్ చీఫ్ సెక్రటరీ అమీర్ సుభానీ స్పందిస్తూ.. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎస్పీని సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకంటామని అన్నారు. ఎలాంటి కారణం లేకుండా ఉద్యోగులను దూషించడం, ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తే సహించేది లేదని అన్నారు. మరి పోలీసులనే లాకప్ లో పెట్టిన ఎస్పీపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
Nawada SP Accused Of Detaining 5 Policemen, BPA Demanded Investigation
Read more:https://t.co/K3LIGpUCa5#BiharPolice @bihar_police pic.twitter.com/65MGPNcE3k— The National Bulletin (@TheNationalBul1) September 10, 2022