సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. డబ్బులు ఇవ్వలేదన్న నేపంతో ఓ కసాయి కొడుకు తల్లినే హతమార్చిన ఘటన జిల్లాలోని హత్నూర పరిధిలో చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..మంగాపూర్ గ్రామానికి చెందిన కొండని ఎల్లమ్మ-ఎల్లయ్య భార్యాభర్తలు. ఎన్నో ఏళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. కానీ వీళ్లకు పిల్లలు మాత్రం కలగలేదు. ఇక ఆ భార్యభర్తలు పిల్లలు లేరన్న దిగులుతో కొన్నాళ్లు మానసిక వేదనకు గురయ్యారు.
కొన్నాళ్లపాటు అలా వారి జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు. ఇక ఇంతలో సాదుకుందామని భావించి మహేందర్ అనే కుమారుడిని తెచ్చుకుని పెంచుకున్నారు. ఇక పెరిగిన మహేందర్ పెద్దవాడయ్యాడు. కానీ ఈ నేపథ్యంలోనే ఎల్లమ్మ భర్త ఎల్లయ్య ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. దీంతో అప్పటి నుంచి ఎల్లమ్మ మహేందర్ తో పాటే కలిసి ఉంటుంది. ఇక ఎల్లమ్మ పేరు మీద తనకు 11 గుంటల భూమి ఉంది. ఈ మధ్య కాలంలోనే ఆ భూమిని అమ్మి వచ్చిన డబ్బులను తన పేరు మీద బ్యాంకులో భద్రపరుచుకుంది.
కాగా అది గమనించిన మహేందర్ నాకు డబ్బులు కావాలంటూ ప్రతి రోజు మద్యం తాగి తల్లిని వేధించేవాడు. ఇక మహేందర్ పెట్టే వేధింపులను ఎల్లమ్మ రోజు భరిస్తూ ఉండేది. దీంతో ఒక రోజు మహేందర్ మద్యం తాగి వచ్చి నాకు డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ తల్లితో వాదనకు దిగాడు. దీనికి ఎల్లమ్మ నిరాకరించటంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగి పెరిగి తారా స్థాయికి చేరుకుంది.
ఇక మహేందర్ అగ్రహంతో ఊగిపోయి ఇంట్లో ఉన్న కర్రతో తల్లి మోహంపై, తలపై బలంగా బాదాడు. దీంతో ఎల్లమ్మ అక్కడిక్కడే రక్తపు మడుగులో పడి మరణించింది. హత్య చేసిన కొడుకు మహేందర్ దీనిని తన వైపు రాకుండా మా అమ్మకు ఏమైందో పలకటం లేదంటూ ఏడుస్తూ పక్కింటి వాళ్లకు తెలియజేశాడు. దీంతో అందరూ వచ్చి చూసే సరికి మహేందరే ఈ ఘాతుకానికి తెగబడ్డాడని గ్రహించి అతన్ని అందరూ చితకబాదారు. ఇక తీవ్రగాయాలతో ఉన్న మహేందర్ ను చికిత్స నిమ్మిత్తం ఆస్పత్రికి తరలించారు.