సింగర్ హరిణి.సింగర్ గా సౌత్ లో ఈమెకి మంచి పేరు ఉంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ మధ్యనే పెద్ద సినిమాలకి సైతం పాటలు పాడుతూ మంచి పేరు తెచ్చుకుంది. హైదరాబాద్ లో ఎస్.ఆర్. నగర్ లో వీరి ఫ్యామిలీ నివాసం ఉంటూ వస్తోంది. కానీ.., వారం రోజుల క్రితం సింగర్ హరిణి ఫ్యామిలీ మిస్ అయినట్టు హైదరాబాద్ పోలీసులకి కంప్లైట్ అందింది. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదయింది. పోలీసులు ఈ కేసుని విచారిస్తూ.. వారి ఆచూకీ తెలుసుకునేంతలోనే దారుణం జరిగిపోయింది. తాజాగా.. హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం బెంగుళూరులోని రైల్వే ట్రాక్ పై లభించింది.
హరిణి తండ్రి ఏకే. రావు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నుండి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత నుండి ఆయన సుజనా పౌండేషన్ కు సీఈఓగా పనిచేస్తున్నారు. హరిణి తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలో సింగర్ గా పేరు తెచ్చుకొంది. కానీ.., వారం రోజులు నుండి వీరి ఫ్యామిలీ కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే బెంగుళూరులోని రైల్వే ట్రాక్ పై ఆయన ఏకే. రావు మృతదేహం లభ్యం కావడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. అయితే ఏకే రావు ప్రమాదవశాత్తు రైలు నుండి పడి చనిపోయాడా? లేక ఎవరైనా చంపి రైల్వే ట్రాక్ పై పడేశారా? మిగిలిన ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.