ఒకప్పుడు బాలీవుడ్ లో పాప్ సింగర్ గా ఒక్క ఊపు ఊపిన పంజాబీ గాయకుడు దలేర్ మెహందీని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. మానవ అక్రమ రవాణా కేసులో గత కొన్నేళ్లుగా కోర్టులు చుట్టూ తిరుగుతున్న ఈ సింగర్ కు పటియాలా కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ బుల్లితెరపై ఒకప్పుడు తన గానంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గాయకుడు దలెర్ మెహందీ. సింగర్ గా ఆయన ఎంత పాపులారిటీ సంపాదించినా.. వ్యక్తిగత జీవితంలో పలు సమస్యల్లో ఇరుక్కున్నాడు. తాజాగా పంజాబ్ పోలీసులు దలేర్ మెహందీని అరెస్ట్ చేశారు. మానవ అక్రమ రవాణ కేసులో ఉన్న ఆయనను పాటియాలా కోర్టు రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ తీర్చు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ లో పాప్ సింగర్ గా దలేర్ మెహందీ ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఈ క్రమంలో ఆయన తన తమ్ముడు షంషేర్ సింగ్ తో కలిసి ఓ మ్యూజికల్ ట్రూప్ ని ఏర్పాటుచేశారు. ఈ మ్యూజికల్ ట్రూప్ ద్వారా కొంత మందిని విదేశాలకు తరలిస్తున్నట్లు దలేర్ మెహందీ 19 సంవత్సరాల క్రితం ఒక కేసు నమోదు అయ్యింది. తమ మ్యూజికల్ ట్రూప్ ద్వారా పది మందిని అమెరికాకు తరలించినట్లు.. అందుకోసం పెద్ద మొత్తంలో డబ్బు వసూళ్లు చేసినట్లు అభియోగం మోపబడింది. పోలీసులు ఈ కేసును పూర్తిగా విచారణ చేసిన తర్వాత దలేర్తో పాటు ఆయన సోదరుడు షంషేర్ పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు పోలీసులు నిర్ధరించారు. దలెర్ మెహందీ పై 35 కేసులు నమోదు అయ్యాయి.
ఈ కేసు విచారించిన పాటియాల కోర్టు దలేర్ మెహందీ అతని సోదరుడు షంషేర్కు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. తీర్పు అనంతరం దలెర్ మెహందీ అరెస్ట్ చేసి వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కి తరలించారు. ఫార్మాలిటీస్ పూర్తయ్యాక ఆయనను జైలుకు పంపించనున్నారు. ఆ మద్య ఈ కేసు విషయంలో బెయిల్ పై వచ్చారు దలేర్ మెహందీ సోదరులు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.