సైదాబాద్ ఆరేళ్ల చిన్నారి హత్య కేసు తీవ్ర చర్చనీయాంశమైంది. నిందితుడు రాజు గత కొన్ని రోజుల నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగాడు. ఇక ఉదయం నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడంటూ మీడియాలో కూడా కథనాలు వెలువడుతున్నాయి. పోలీసులు కూడా రాజు ఆత్మహత్య చేసుకున్నాడని, అతని చేతిపై ఉన్నటాటూ ఆధారంగా నిందితుడు రాజుగా నిర్ధారించామని పోలీసులు తెలిపారు. అయితే నిందితుడు రాజు మరణంపై భార్య మౌనిక అనుమానాలు వ్వక్తం చేసింది.
నా భర్తను కావాలనే పోలీసులు హత్య చేసి చంపేశారని ఆమె తెలిపింది. నా భర్త చాలా మంచి వ్యక్తి అని, ఇలాంటి ఘోరమైన పనులు ఎప్పుడూ చేయలేదని తెలిపింది. ఒక వేళ నా భర్త అలా చేస్తే గనుక చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి చంపడమేంటంటూ తన ఆవేదనను వెళ్లగక్కింది. ఇక ఇన్ని రోజులు నా భర్త పోలీసుల అదుపులోనే ఉన్నాడని, ఈ రోజు చిత్రహింసలకు గురి నా భర్తను పోలీసులు చంపేశారని రాజు భార్య మౌనిక చెప్పుకొచ్చింది. ఇక నిందితుడి భార్య మౌనిక అనుమానాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.