మార్కెట్ లో ఇప్పటికే చాలా మోసాలు ఉన్నాయి. ఆన్ లైన్ మోసాలతో అమాయకపు ప్రజల నుంచి ఎంతో కాజేశారు. ఇప్పటికే ఎన్నో మోసాలు వెలుగు చూశాయి. పార్ట్ టైమ్ జాబ్ అని, సినిమాలకు రివ్యూలు ఇవ్వాలి, ప్యాకింగ్ జాబ్ అంటూ ఎంతో మందిని మోసం చేశారు. ఇప్పుడు మార్కెట్ లోకి మరో కొత్త మోసం వచ్చింది.
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో.. మోసాలు అంతకంటే ఎక్కువగా పెరిగాయి. ఎక్కడ చూసినా ఆన్ లైన్ స్కాములు ఎక్కువయ్యాయి. ఒక్కో స్కామ్ గురించి వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఎందుకంటే అలాంటి మోసాల గురించి ఎక్కడా విని ఉండరు, చూసుండరు కూడా. గతంలో ఆన్ లైన్ స్మామ్ అంటే నైజీరీయా ముఠా పని అనుకునేవాళ్లు. ఇప్పుడు ఎవరంటే వాళ్లు ఈ మోసాలు చేస్తూ ఈజీ మనీ కోసం అలవాటు పడిపోయారు. తాజాగా ఒక కొత్త మోసం వెలుగు చూసింది. ఒక వ్యాపారవేత్త నుంచి ఏకంగా రూ.72 లక్షలు కాజేశారు. అందుకు వాళ్లు వేసిన ప్లాన్, వాళ్ల ప్రణాళిక చూసి పోలీసులు కూడా నివ్వెర పోయారు. మోసపోయిన విషయాన్ని లేటుగా తెలుసుకున్న వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. అప్పటికే అతని నుంచి రూ.72 లక్షలు కాజేశారు.
మార్కెట్ లో ఇప్పటికే చాలా మోసాలు బయటపడ్డాయి. ఒక్కొక్కరు ఒక తరహాలో ప్రజలను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఇప్పటికే పార్ట్ టైమ్ జాబ్ అని, వీడియోలకు లైక్ చేస్తే మనీ ఇస్తామని, సినిమాలు రేటింగ్ ఇస్తే డబ్బులొస్తాయంటూ మోసాలు చేశారు. అయితే ఇందులో సాధారణంగా ముక్కు, మొఖం చూపించకుండా ఆన్ లైన్, ఫోన్ ద్వారానే మోసాలు చేసేవాళ్లు. ఈసారి మాత్రం మోసగాళ్లు నేరుగా పోలీస్ స్టేషన్ కే వెళ్లారు. పోలీసుల నుంచి వారి వ్యూహాన్ని ప్రారంభించారు. అసలు విషయం తెలుసుకున్న పోలీసులు మోసగాళ్లకు ఇంత ధైర్యం వచ్చిందా అని ఆశ్చర్యపోయారు.
ఇప్పుడు చెప్పుకోబోయేది సిమ్ శ్వాప్ స్కామ్ అనమాట. కోల్ కతాలో ఈ మోసం వెలుగు చూసింది. అక్కడ ఉన్న ఒక వ్యాపారికి సంబంధించి అన్ని వివరాలను సేకరించారు. అతనికి సంబంధించిన ఆధార్, పాన్ కార్డ్ వంటి డాక్యుమెంట్లను కూడా పట్టుకొచ్చారు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అక్కడ తమ యజమాని సిమ్ పోయిందని కంప్లైంట్ చేశారు. పోలీసుల నుంచి ఒక ఎఫ్‌ఐఆర్ తీసుకున్నారు. నేరుగా సిమ్ నెట్ వర్క్ ప్రతినిధులను కలిసి ఈ ఎఫ్‌ఐఆర్ చూపించి పాత సిమ్ బ్లాక్ చేయించి.. కొత్త సిమ్ తీసుకున్నారు. వ్యాపారి దగ్గరున్న సిమ్ బ్లాక్ అయిపోయింది. అతను ఒక రోజు వరకు అసలు అతని నంబర్ ఎందుకు పనిచేయట్లేదు అనే విషయాన్ని పట్టించుకోలేదు.
ఏదో నెట్ వర్క్ ప్రాబ్లమ్ అనుకుని ఊరుకున్నాడు. వెంటనే వీరి వద్దనున్న సిమ్ యాక్టివేట్ అయ్యింది. ఇంకేముంది బ్యాంకు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని ఓటీపీలు స్కామర్ల దగ్గరున్న నంబర్ కే వచ్చాయి. అంతే.. వ్యాపారి ఖాతాలో ఉన్న రూ.72 లక్షలు ఖాళీ చేశారు. ఒకరోజు తర్వాత అసలు విషయం తెలుసుకుని ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులనే మోసం చేసి ఇలా చేస్తారా? అని దర్యాప్తు చేసి అసలు మోసగాళ్లైన దంపతులను పట్టుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ తరహా మోసాలు కూడా జరుగుతున్నాయని తెలుసుకుని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మీ నంబర్ పనిచేయకపోతే అసలు ఎందుకు పని చేయడం లేదు అనే విషయాన్ని తెలుసుకోవాలంటూ టెక్ నిపుణులు సూచిస్తున్నారు.