Silver And Money: డబ్బులు సంపాదించటం ఒక ఎత్తయితే.. కోట్లకు కోట్లు డబ్బు సంపాదించి, పన్ను ఎగ్గొట్టి వాటిని దాచుకోవటం మరో ఎత్తు. ఆ డబ్బు సంపాదించటానికి కూడా పడని కష్టం దాచటానికి పడాల్సి వస్తుంది. పెద్ద పెద్ద ప్లాన్‌లు వేయాల్సి వస్తుంది. టాయిలెట్ సీట్లలో, ఇంటి గోడల్లో, వాటర్ ట్యాంకుల్లో ఒక్కోరు ఒక్కో స్టైల్‌ను ఫాలో అయి డబ్బును దాస్తూ ఉంటారు. అయినా ఏం లాభం అధికారులు వాటిని డేగ కళ్లతో గుర్తించి పట్టుకుపోతారు. తాజాగా, ఓ వ్యాపారి లెక్కకు చూపని తన డబ్బును, వెండిని ఆఫీసులోని గోడలో, టైల్స్ ఫ్లోర్ కింద దాచి పెట్టాడు. తనిఖీల కోసం వచ్చిన జీఎస్టీ అధికారులు దాన్ని ఇట్టే కనిపెట్టారు. టైల్స్‌ను తొలగించి, గోడను బద్ధలు కొట్టి.. వెండి ఇటుకలు, కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబైలోని చాముండ బిలియన్ గ్రూపు కంపెనీ ఆదాయం సంవత్సర కాలంలో వెయ్యికోట్ల రూపాయలకు పైగా పెరిగినట్లు జీఎస్‌టీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ టీం చాముండ బిలియన్‌కు సంబంధించిన వివిధ కంపెనీలపై రైడ్ జరిపింది. రైడ్ సందర్భంగా ఓ కంపెనీలోని ఓ గదిలో టైల్స్ ఉబ్బుగా ఉండటం అధికారులు గుర్తించారు. అనుమానం వచ్చి వాటిని తొలగించగా దాని కింద గోనె సంచులు బయటపడ్డాయి. ఆ గోనె సంచుల నిండా డబ్బు కట్టలు ఉన్నాయి. ఆ తర్వాత అధికారులు వేరే గదిలో గోడను బద్ధలు కొట్టగా వెండి ఇటుకలు, డబ్బుల కట్టలు బయటపడ్డాయి. 9.8 కోట్ల నగదు, 19 కేజీల వెండి ఇటుకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆ డబ్బు ఎక్కడిదో తమకు తెలియదని, అక్కడ ఎవరు దాచిపెట్టారో కూడా తెలియదని సదరు బిల్డింగ్ యజమానులు, కుటుంబసభ్యులు అధికారులకు తెలిపారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఇష్టం లేని పెళ్లి చేశారని కొత్తపెళ్లి కూతురు షాకింగ్ డిసిషన్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.