సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పండగ పూట భార్య బతుకమ్మ ఆడుతుండగా అందరి ముందే భర్త కిరాతకానికి పాల్పడ్డాడు. ఈ సీన్ చూసిన గ్రామాంలోని ప్రజలంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. పండగపూట భర్త చేసిన దారుణం ఏంటి? గ్రామస్తులంతా ఖంగుతినేలా చేసిన ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జిల్లాలోని బెజ్జంకి వీరాపూర్ గ్రామంలో ఎల్లారెడ్డి, స్వప్ప అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి పెళ్లై 20 ఏళ్లు అవుతుంది.
వివాహం అయిన కొంత కాలానికి వీరికి కూతురు సుష్మిత, కొడుకు శ్రీజన్ జన్మించారు. ఇక పుట్టిన పిల్లలతో ఈ దంపతు కొంత కాలం పాటు బాగానే ఉన్నారు. కానీ గత 5 ఏళ్ల భార్య స్వప్న అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో పారిపోయి పెళ్లి చేసుకుంది. అయితే అప్పటి నుంచి స్వప్న తన ప్రియుడితో పాటు ఉంటుంది. ఇదికాక ఇటీవల తన సొంతూరు రావడమే కాకుండా భర్త ముందే ప్రియుడితో ఊళ్లో తిరుగుతోంది. దీంతో మొదటి భర్త ఎల్లారెడ్డికి ఎక్కడలేని కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. ఊర్లో నా పరువు తీస్తున్న స్వప్నపై ఎల్లారెడ్డి పగ తీర్చుకోవాలనుకున్నాడు. అయితే ఇందులో భాగంగానే ఆదివారం బతుకమ్మ పండగ కావడంతో భార్య స్వప్న అందరితో పాటు బతుకమ్మ ఆడడానికి వెళ్లింది. వెంటనే ఎల్లారెడ్డి ఊళ్లో జరుగుతున్న బతుకమ్మ వేడుకల వద్దకు వెళ్లాడు.
అక్కడ తన భార్యను చూసిన ఎల్లారెడ్డి అందరి ముందే ఇనుప రాడ్డుతో భార్య తలపై బలంగా బాదాడు. ఈ దాడిలో రక్తపు మడుగులో పడి స్వప్ప అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ సీన్ ను చూసిన గ్రామస్తులు అంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఈ ఘటనపై స్పందించిన స్పప్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మా కూతురిని దారుణంగా హత్య చేసిన ఆ కిరాతకుడిని శిక్షించాలంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.