పెళ్లైన నెలకు ఓ కొత్త పెళ్లి కూతురు దారుణానికి పాల్పడింది. ప్రియుడితోనే ఉండాలని భావించింది. కానీ తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేయడంతో చివరికి కట్టుకున్న భర్తనే హతమర్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా తోగుట మండలం గుడికందుల గ్రామం. శ్యామల (19) అనే యువతి ఇదే ప్రాంతానికి చెందిన శివకుమార్ అనే యువకుడితో పాటు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంది.
దీంతో ఇద్దరు స్నేహితులుగా మారిపోయారు. ఇక రాను రాను వారి స్నేహం ప్రేమగా మారింది. అలా వారి ప్రేమ పరుగులు తీస్తూ మూడేళ్లకు చేరుకుంది. అయితే ఇటీవలే శ్యామలకు ఆమె తల్లిదండ్రులు యువతికి ఇష్టం లేకున్నా చంద్రశేఖర్ అనే యువకుడితో ఘనంగా పెళ్లి చేశారు. ఇక పెళ్లైన నాటి నుంచి శ్యామలకు భర్తతో ఉండడం అస్సలు ఇష్టం లేదు. ఇక ప్రియుడితోనే కలిసి ఉండాలని భావించిన శ్యామల భర్త హత్యకు స్కెచ్ వేసింది. దీంట్లో భాగంగానే ఏప్రిల 19 తినే అన్నంలో ఎలుకల మందు కలిపి తినిపించింది. దీంతో చంద్రశేఖర్ తీవ్ర అస్వస్థకు గురి కావడంతో హుటాహుటిన హైదరాబాద్ కు తరలించి చికిత్స అందించారు.
ఇది కూడా చదవండి: Saroor Nagar Crime: మా అన్నతో మాట్లాడించండి.. పరువు దక్కిందేమో అడుగుతా: అశ్రిన్ఇక చికిత్స తర్వాత కోలుకున్న భర్త చంద్రశేఖర్ ను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. ఇక కొన్ని రోజుల తర్వాత స్థానికంగా ఉండే ఓ దేవాలయంలో మొక్కుకోసమని దేవుని వద్దకు వెళ్లి భార్యాభర్తలిద్దరూ దర్శించుకున్నారు. అలా కొద్దిసేపటి తర్వాత సేదతీరేందుకని భార్య ఓ నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లింది. దీంతో అప్పటికే కాపుకాసి ఉన్న ప్రియుడు శివకుమార్ అక్కడికి చేరుకున్నారు. ఇక పథకం ప్రకారం శ్యామల ప్రియుడితో కలిసి రుమాలుతో భర్తకు గొంతును నులిమి హత్య చేసింది.
దీంతో భర్త చంద్రశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇక చంద్రశేఖర్ మరణంపై అనుమానమొచ్చిన అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా భార్య శ్యామల ప్రియుడితో కలిసి హత్య చేసిందని తేలింది. ఇక నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.