తెల్లారితే కూతురు పెళ్లి. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. బంధువులు అంతా ఇంటికి చేరడంతో ఇళ్లంతా సందడిగా మారింది. ఇక మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా.. పెళ్లి కూతురు తండ్రి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?
తన కూతురుని తండ్రి ఎంతో గారాబంగా పెంచి, పెద్ద చేశాడు. ఉన్నత చదువులు చదివించాడు. ఇక పెళ్లి వయసు రావడంతో మంచి యువకుడితో పెళ్లి చేయాలని భావించాడు. తాను అనుకున్నట్లే ప్రభుత్వ ఉద్యోగితో కూతురి పెళ్లికి నిశ్చితార్థం జరిపించాడు. పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక తెల్లారితే కూతురి వివాహం అనగా అర్థరాత్రి ఎవరూ లేని టైమ్ లో పెళ్లి కూతురు తండ్రి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపురం గ్రామం. ఇక్కడే అయిలయ్య (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఓ కూతురు, కుమారుడు సంతానం. పుట్టిన పిల్లలను తండ్రి ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నత చదువులు చదివించాడు. నా పిల్లలు బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని కలలు కన్నాడు. ఇందుకోసం అతని కూతురు కూడా బాగానే చదువుకుంది. ఇక వరుసకు మేనల్లుడు ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనితో తన కూతురికి పెళ్లి చేయాలని అయిలయ్య అనుకున్నాడు.
ఇందుకోసం అతని తల్లిదండ్రులతో మాట్లాడి తన కూతురితో పెళ్లికి ఈ నెల 21న నిశ్చితార్జం జరిపించారు. ఒక్కగానొక్క కూతురు కావడంతో అయిలయ్య పెళ్లి ఘనంగా జరిపించాలని అనుకున్నాడు. పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. కానీ, సమయానికి డబ్బులు ఇస్తామన్న వ్యక్తులు చేతులు ఎత్తేయడంతో అయిలయ్యకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇందుకోసం ఎంతోమందిని అప్పు కావాలని అడిగాడు. కానీ, అయిలయ్య పరిస్థితిని చూసి అప్పు ఇవ్వడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. తెల్లారితే పెళ్లి, చేతిలో సరిపడా డబ్బు లేదు. ఆ సమయంలో అయిలయ్యకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక అయిలయ్య శుక్రవారం అర్థరాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇది గమనించిన కొందరు బంధువులు వెంటనే కిందకు దించి ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు, భార్య, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. తెల్లారితే కూతురి పెళ్లి, అంతలోనే తండ్రి మరణించడంతో స్థానికులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కూతురు పెళ్లికి అప్పు పుట్టకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న ఈ తండ్రి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.