ఈ యువకుడి పేరు అభిషేక్, వయసు 19 ఏళ్లు. చదువుకుంటూనే నగరంలోని ఓ షాపింగ్ మాల్ లో పనికి కుదిరాడు. అయితే పని చేసే చోట అభిషేక్ కు ఓ పెళ్లైన మహిళ పరిచయం అయింది. ఈ పరిచయం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే అభిషేక్ ఆ రోజు తన ప్రియురాలిని అలా చూసి..!
ఈ యువకుడి పేరు అభిషేక్, వయసు 19 ఏళ్లు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. అయితే ఈ యువకుడు చదువుకుంటూనే నగరంలోని ఓ షాపింగ్ మాల్ లో పనికి కుదిరాడు. అయితే ఆ మాల్ లో అభిషేక్ కు ఓ పెళ్లైన మహిళ పరిచయం అయింది. ఈ పరిచయంతోనే ఆమెతో మాటా మాటా కలిపాడు. దీంతో ఇద్దరూ దగ్గరయ్యారు. అలా కొంత కాలం పాటు ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం నడిచినట్టుగా తెలుస్తోంది. కట్ చేస్తే ఇటీవల ఆ మహిళను అభిషేక్ అలా చూసి ఒక్కసారిగా షాక్ గురై ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
సిద్దపేట జిల్లా కూకునూరుపల్లి మండలం మంగోల్ గ్రామంలో అభిషేక్ (19) అనే యువకుడు నివాసం ఉండేవాడు. ప్రస్తుతం ఇతడు డిగ్రీ చదువుతున్నాడు. అతడు చదువుకుంటూనే హైదరాబాద్ సుచిత్రలోని ఓ షాపింగ్ మాల్ లో పనికి కుదిరాడు. అలా కొన్నాళ్ల తర్వాత అభిషేక్ కి షాపింగ్ మాల్ లో పని చేసే ఓ పెళ్లైన మహిళ పరిచయం అయింది. ఆమె కూడా ఆ యువకుడితో తరుచు మాట్లాడేది. దీంతో ఇద్దరి పరిచయం చివరికి వివాహేతర సంబంధంగా మారింది. అలా కొన్నాళ్ల పాటు వీరిద్దరూ ఈ వ్యవహారాన్ని సీక్రెట్ గానే నడిపించారు.
ఇదిలా ఉంటే ఇటీవల అదే మహిళ మరొక యువకుడితో చనువుగా ఉండగా అభిషేక్ చూశాడు. వాళ్లిద్దరినీ అలా ఆ యువకుడు తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అప్పటి నుంచి అతడికి ఏం చేయాలో అర్థం కాక ఈ నెల 17న పురుగుల మందు తాగాడు. అతని కుటుంబ సభ్యులు వెంటనే గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అభిషేక్ బుధవారం ప్రాణాలు విడిచాడు. కుమారుడి మరణంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన మహిళతో వివాహేతర సంబంధించి నడిపించి చివరికి ఆత్మహత్య చేసుకున్న అభిషేక్ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.