Kabaddi: తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కబడ్డీ ఆడుతూ ఓ ఎస్‌ఐ మృత్యువాతపడ్డారు. ఆట ఆడుతుండగా హఠాత్తుగా గుండెపోటు రావటంతో అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు.. ఎం.సుబ్రహ్మణ్యం(57) తిరుపతి పడమర పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. తిరుపతి గ్రామీణ మండలం మల్లంగుంట పంచాయితీ అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. గురువారం అంబేద్కర్ జయంతి సందర్బంగా కాలనీలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. సుబ్రహ్మణ్యం పోటీలకు హాజరయ్యారు.
క్రీడలపై ఆసక్తి ఉన్న ఆయన యువకులతో కలసి కబడ్డీ ఆడారు. కూతకు వెళ్లి వస్తూ.. ఉన్నట్టుండి నేలపై కుప్పకూలారు. ఆయన్ని హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కాగా, సదరు ఎస్‌ఐకి పెళ్లై, ఇద్దరు కుమారులు ఉన్నారు. 1984లో పోలీస్ కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో చేరారు. 2019లో ఎస్‌ఐగా పదోన్నతి పొందారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : అపశృతి: తాడు తెగి భక్తులపై పడ్డ ధ్వజస్తంభం..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.