Mahabubabad: ఓ పోలీస్ అధికారిని మృత్యువు నీడలా వెంటాడింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆయన్ని బలితీసుకుంది. వారం రోజుల కాలంలో రెండు సార్లు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిక్షపతి మరిపెడలో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మహబూబాబాద్‌నుంచి బైకుపై ఇంటికి వెళుతుంటే గేదె అడ్డం వచ్చింది. దీంతో ఆయన దాన్ని ఢీకొట్టారు. గాయాలపాలవ్వటంతో హైదరాబాద్‌లో చికిత్స తీసుకున్నారు. హైదరాబాద్‌నుంచి తిరిగి వచ్చిన ఆయన.. బుధవారం మహబూబాబాద్‌కు బయలుదేరారు. ఈ సారి బైకుపై కాకుండా కారులో పయనమయ్యారు.
అయితే, మృత్యువు ఆయన్ని వెంటాడుతున్నట్లుగా.. మరిపెడ మండలం పురుషోత్తమయగూడెం గ్రామ శివారులోకి కారు రాగానే టైరు పేలింది. ఈ నేపథ్యంలో కారు అదుపుతప్పి పొలాల్లోకి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఎస్‌ఐ తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు ఆయన్ని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భిక్షపతి మరణించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Uttar Pradesh: భార్యాభర్తల గొడవ.. ఆగ్రహంతో భార్య ముక్కు కొరికిన భర్త!