దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. శ్రద్ధాను చంపడం మొదలుకొని ముక్కలు ముక్కలుగా కోయడం వరకు నిందితుడు అఫ్తాబ్ ఒక ప్రీ ప్లాన్డ్ గా చేసినట్లు పోలీసులు గుర్తించారు. అఫ్తాబ్ కు నిన్న మధ్యాహ్నం నిన్న ఉదయం 12 గంటల సమయంలో పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించిన పోలీసులు పలు కీలక విషయాలు రాబట్టారు. శ్రద్ధా హత్య విషయంలో దొరకకుండా ఉండడానికి.. ఆఫ్తాబ్ పక్కా ప్లానింగ్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అలాగే శ్రద్ధా శరీర భాగాలను పారేసే సమయంలో భవిష్యత్తులో ఎటువంటి ఎలక్ట్రానిక్ ఆధారాలు పోలీసులకు చిక్కకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు అని వెల్లడించారు.
ఢిల్లీ, రోహిణిలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలో అఫ్తాబ్ కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. పోలీసులు హిందీ లో ప్రశ్నలు అడిగితే.. అతడు మాత్రం ఇంగ్లీషులో సమాధానాలు చెప్పినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో శ్రద్ధాతో సంబంధం, ఆమె హత్యకు దారితీసిన పరిణామాలు, నేరం ఎప్పుడు జరిగింది? శరీర భాగాలను ఎక్కడెక్కడ పడేశాడు? వంటి పలు ప్రశంలు అడిగినట్లు తెలిపారు. ఈ ప్రశ్నల పరంపర ఎనిమిది గంటల పాటు సాగింది. నేడు కూడా అతడికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
మరోవైపు ఆఫ్తాబ్ ఇంటి నుంచి పోలీసులు ఐదు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇవి దాదాపు ఆరు అంగుళాల పొడవు ఉన్నట్లు తెలిపారు. వీటిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీకి పంపించారు. అలాగే.. నిన్న సూరజ్ కుండ్ అడవుల్లో సూట్ కేసులో కొన్ని శరీరభాగాలు దొరికాయి. వీటిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ఈ భాగాలను డీఎన్ఏ పరీక్షలకు పంపనున్నారు. ఇక శ్రద్ధ హత్య కేసుపై స్పందించిన ఆమె మిత్రులు, సంచలన విషయాలు వెల్లడించారు. వారు కలిసి ఉన్న రోజుల్లో ఆఫ్తాబ్.. ఆమె వీపుపై సిగరెట్టుతో కాల్చేవాడని తెలిపారు. ఆఫ్తాబ్ తో కలిసి ఉండాలని భావించినా శ్రద్ధా అతడిని భరించినట్టు చెప్పుకొచ్చారు.