దేశ వ్యాప్తంగా వెన్నులో వణుకు పుట్టించింది శ్రద్ధా వాకర్ హత్య ఘటన. ఈ కేసులో తాజాగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
దేశ వ్యాప్తంగా శ్రద్ధా వాకర్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రియురాలిని ప్రియుడు ముక్కలు ముక్కలుగా నరికి వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. గతేడాది ఢిల్లీలో జరిగిన ఈ ఘటన అప్పట్లో అందరినీ షాక్ గురి చేసింది. ఈ ఘటన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎట్టకేలకు నిందితుడిని అన్ని కోణాల్లో విచారించి అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో తాజాగా దిమ్మతిరిగే ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు అఫ్పాబ్ పూనావాలా మాట మార్చి అందరికి షాకిచ్చాడు. విషయం ఏంటంటే?
మంగళవారం ఢిల్లీలోని సాకెత్ కోర్టు శ్రద్ధా వాకర్ కేసుపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా నిందితుడు అఫ్పాబ్ పూనావాలాపై ఢిల్లీ పోలీసులు అభియోగాలు మోపారు. దీంతో న్యాయస్థానం నిందితుడిపై హత్య నేరం (ఐపీసీ సెక్షన్ 302) కింద కేసు నమోదు చేసింది. దీంతో పాటు సాక్ష్యాలను తారుమారు చేసినందుకు (ఐపీసీ సెక్షన్ 201) కింద నిందితుడు అఫ్పాబ్ పూనావాలాపై కేసు కూడా నమోదు చేశారు. ఇక విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు అఫ్పాబ్ పూనావాలాను దోషిగా చేర్చేందుకు అన్ని సాక్ష్యాలను కోర్టుకు సమర్పించింది. ఇక పోలీసుల ఆరోపణలను నిందితుడు ఖండించారు. నేను నా ప్రియురాలిని చంపలేదని, ఏ విచారణకైనా సిద్దం అంటూ డిమాండ్ చేశారు. దీంతో కోర్టు ఈ కేసు విచారణ జూన్ 1కి వాయిదా పడింది.
అసలేం జరిగిందంటే?
అఫ్పాబ్ పూనావాలా, శ్రద్ధా వాకర్ ప్రేమికులు. చాలా కాలంగా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. అయితే మే 2022లో ఢిల్లీలో పూనావాలా ప్రియురాలిపై కోపంతో శ్రద్ధా వాకర్ ను దారుణంగా హత్య చేశాడు. ఆమె శరీరాన్ని 35 భాగాలు చేసి వివిధ ప్రదేశాల్లో విసిరేశాడు. ఇక చాలా రోజుల నుంచి కూతురి జాడ తెలియకపోవడంతో మృతురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించి ఎట్టకేలకు నిందితుడు అఫ్పాబ్ పూనావాలా అరెస్ట్ చేశారు. అప్పట్లో ఈ కేసు అందరినీ షాక్ గురి చేసి వెన్నులో వణుకు పుట్టించింది. అయితే నిందితుడు ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నాడు.