ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రాథమికంగా కుటుంబ కలహాల నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున ముందుగా నాలుగేళ్ల చిన్నారికి ఉరేసిన తర్వాత దంపతులతో పాటు మరో మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసినా.. ఘటనలో మరింత విచారణ జరిపిన పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. హైదరాబాద్‌లోని హబ్సిగూడలో కేవలం ఒక్కరు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారని.. మిగిలిన ముగ్గురిది హత్య అని పోలీసుల విచారణ తెలిసినట్లు సమాచారం.
హైదరాబాద్‌లోని హబ్సిగూడలోని ఓ అపార్టుమెంట్‌లో నివాసం ప్రతాప్(34), సింధూర(32) దంపతులు నాలుగేళ్ల చిన్నారి ఆద్యతో పాటు ప్రతాప్ తల్లితో కలిసి నివాసం ఉన్నారు. కాగా ప్రతాప్
చెన్నైలోని ఓ కారు షోరూమ్‌లో డిజైనర్ మేనేజర్‌గా పనిస్తున్నారు. ఆయన భార్య సింధూర హిమయత్‌నగర్‌లోని ఓ ప్రవేట్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. అయితే ఏడాది కాలంగా ఫ్యామిలీ చెన్నైకు షిఫ్ట్ చేయాలని ప్రతాప్, లేదు హైదరాబాద్‌లోనే స్థిరపడాలని సింధూర మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం కూడా ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ప్రతాప్.. సింధూరను చంపి, ఆ తర్వాత తన కూతురు ఆద్యకు ఉరివేసినట్లు తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు.
సోమవారం తెల్లవారుజామున తల్లిని కూడా హతమార్చి.. వారి ముగ్గురికి ఉరి వేసినట్లు చిత్రీకరించి.. ప్రతాప్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతాప్ కుటుంబం మొత్తం ఆదివారం బయటకు కూడా వెళ్లి వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అయితే.. సోమవారం సింధూర కోసం బ్యాంకు సిబ్బంది వచ్చి.. తలుపు కొట్టగా.. ఎంతకీ తీయకపోవడంతో.. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు వచ్చిన తలుపుతు తెరవగా.. నలుగురు ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న సింధూర తల్లి మాట్లాడుతూ.. ప్రతాప్-సింధూర మధ్య ఏడాది కాలంగా ఫ్యామిలీ ఎక్కడ స్థిరపడాలనే విషయంలో గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.