ఎటు నుండి ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో చెప్పడం కష్టం. వచ్చి ఒక్కసారిగా ప్రాణాలను హరించేస్తుంటుంది. ఒక్కో సందర్భంలో చావు తప్పి.. చిన్న చిన్న గాయాలతో బయటపడుతుంటారు. తాాజాగా ఓ వ్యక్తి చేసిన పొరపాటు.. భార్యపై ఎఫెక్ట్ చూపింది.
కొన్ని సార్లు ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ ప్రమాదాలు జరుగుతాయని ఊహాకు కూడా అందవు. ఎటు నుండి ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో చెప్పడం కష్టం. వచ్చి ఒక్కసారిగా ప్రాణాలను హరించేస్తుంటుంది. ఒక్కో సందర్భంలో చావు తప్పి.. చిన్న చిన్న గాయాలతో బయటపడుతుంటారు. అయితే అదీ అదృష్టమనే చెప్పాలి. అయితే కళ్ల ముందే అయిన వారు ప్రమాదాలకు గురై చనిపోతుంటే.. ఆ బాధ చెప్పడం వర్ణనాతీతం. ఆ చావుకు కుటుంబ సభ్యులే కారకులైతే.. అదీ అనుకోకుండా. ఓ వ్యక్తి విషయంలో ఇదే నిజమైంది. తన చేతుల్లోనే భార్య చనిపోయింది. ఈ ఘటన చైనాలో జరిగింది.
చైనాకు చెందిన జాంగ్, సన్ మోమో భార్య భర్తలు. చైనీస్ అక్రోబాట్ జిమ్నాస్టిక్ ప్రదర్శనలు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరూ ప్రదర్శనలిస్తున్నారు. అయితే సెంట్రల్ అన్హుయ్ ప్రావిన్స్‌లోని సుజౌ నగరంలో ఫ్లయింగ్-ట్రాపెజ్‌లో ప్రదర్శన ఇస్తుండగా.. ప్రమాదవ శాత్తూ భార్య పడిపోయింది. అందరూ చూస్తుండగానే ఆమె పడిపోవడంతో ఒక్కసారిగా వీక్షకులు విస్తుపోయారు. 30 అడుగుల ఎత్తు నుంచి ఆమె పడిపోయింది. ఆమె భాగస్వామి కాళ్లతో ఆమెను క్యాచ్ చేయడంలో విఫలమవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమె ఇద్దరు పిల్లల తల్లి అని సమాచారం.
ఆ భార్యభర్తలిద్దరూ ఇలాంటి ప్రదర్శనలు చాలా సార్లు ఇచ్చారని, పైగా ఎప్పుడూ కూడా బెల్ట్‌లు లేకుండానే చేశారని చెబుతున్నారు స్థానికులు. ఐతే ఈ ఘటన జరిగే ముందు ఇద్దరు గొడవపడ్డారని, ఆ మహిళను సేఫ్టి ప్రికాషన్స్ తీసుకోమని చెప్పినా.. నిరాకరించిందని సమాచారం. ఐతే ఆమె భర్త మాత్రం ఆ వ్యాఖ్యలను ఖండించాడు. తాము ఎప్పుడూ అన్యోన్యంగా ఉండేవాళ్లమని చెబుతున్నాడు. ఈ ఘటన తర్వాత షో రద్దైంది. ఈ మేరకు అధికారలు కేసు నమోదు చేసుకుని ఆ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు.