‘అనుమానం పెనుభూతం’ అన్న నానుడి ఊరికే రాలేదు. మనిషి బుర్రలో అనుమానం అన్న ఒక చిన్న పురుగు దూరిందంటే అతను ఎంత దారుణానికైనా ఒడిగడతాడు. అలాంటి ఘటనలు చాలానే చూసుంటారు. భార్యపై అనుమానంతో చితక బాదిన భర్త, అనుమానంతో అర్ధాంగిని కడతేర్చిన భర్త, అనుమానంతో విడాకులు ఇచ్చిన భర్త. ఈ ఘటనలో అసలు ఊహించడానికి కూడా వీల్లేనంత క్రూరంగా, అమానవీయంగా ప్రవర్తించాడు ఓ భర్త. తనపై అనుమానంతో ఆమె జననాంగానికి కుట్లు వేశాడు. వినడానికే జుగుబ్సాకరంగా ఉన్న ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకెళితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలీ జిల్లా రైలా గ్రామంలో ఓ వ్యక్తి తన భార్యపై ఆనుమానంతో అతంటి దిగ్భ్రాంతికర దారుణానికి పాల్పడ్డాడు. తనను మోసం చేస్తుందని అతను భావించి ఆ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తమకు మహిళ సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే తన భర్త పట్ల ఆ మహిళ అత్యంత దయాగుణం ప్రదర్శించింది. తన భర్తపై కఠినమైన చర్యలు తీసుకోవడ్దని ఆమె పోలీసులను వేడుకుంది. తన భర్తను పట్టుకుని కేవలం కొట్టాలని, తిరిగి అటువంటి పనిచేయకుండా బుద్ధి చెప్పి వదిలేయాలని కోరింది. ప్రస్తుతం ఆ మహిళకు సిగ్రౌలీలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.