పార్టీల పేరుతో అమ్మాయిలతో నగ్నంగా నృత్యాలు చేయిస్తూ, వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మిగిలిన వివరాలు..
దేశంలో స్త్రీలకు స్వేచ్ఛ లేకుండా పోతోంది. రాత్రిపూటే కాదు పగటిపూట కూడా మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు లేవు. చిన్నారులు, అమ్మాయిలు అనే తేడాల్లేకుండా ఏదో ఒక చోట అఘాయిత్యాలకు గురవుతున్నారు. ఈ విషయంలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు ఎంత ప్రయత్నిస్తున్నా, కోర్టులు కఠిన శిక్షలు అమలు చేస్తున్నా పెద్దగా ఫలితాలు కనిపించడం లేదు. కాగా, పార్టీల పేరుతో అమ్మాయిలతో నగ్నంగా నృత్యాలు చేయిస్తున్న ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. కొందరు కేటుగాళ్లు పోలీసుల కళ్లు గప్పి వారిపని వారు చేసుకుంటూ పోతున్నారు. పార్టీల పేరుతో ఏకంగా అమ్మాయిలతో నగ్నంగా డ్యాన్సులు చేయించి, వ్యభిచారం నిర్వహిస్తూ డబ్బులు సొమ్ముచేసుకుంటున్నారు.
హైదరాబాద్‌లోని శంషాబాద్, మెయినాబాద్ పరిధిలో ముజ్రా పార్టీల పేరుతో నిర్వహిస్తున్న ఒక గలీజ్ దందా వెలుగులోకి వచ్చింది. అమ్మాయిలతో నగ్నంగా నృత్యాలు చేయిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. అక్రియేషన్ ఫామ్ హౌస్, మ్యాంగోవుడ్ ఫామ్ హౌస్, కుషీ కర్తీ ఫామ్‌తో పాటు బ్రౌన్ టౌన్ ఫామ్ హౌస్‌లో రూల్స్‌కు విరుద్ధంగా యువత మందుకొడుతూ మైమరచిపోతోందని పోలీసులు గుర్తించారు. ఆయా ఫామ్ హౌస్‌ల మీద కేసులు నమోదు చేశారు. శంషాబాద్‌తో పాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్‌లోనూ ఎస్వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పేట్ బషీరాబాద్‌లోని లక్ష్మీ విల్లా గెస్ట్ హౌస్‌లో మత్తులో ఊగుతున్న 8 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.