కొందరు వ్యక్తులు షాద్ నగర్ పట్టణ కేంద్రంలో పాడు పనులకు శ్రీకారం చుట్టారు. అందమైన అమ్మాయిలను టార్గెట్ గా చేసుకుని గలీజ్ దందా తెర లేపుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే?
గత కొన్నేళ్లుగా హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకుని కొందరు వ్యక్తులు గలీజ్ దందాకు శ్రీకారం చుట్టారు. అందమైన అమ్మాయిలను టార్గెట్ గా చేసుకుని పాడు పనులకు తెర లేపుతున్నారు. ఒక హైదరాబాద్ లోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు గతంలో జోరుగా జరిగాయి. వీటిపై ఫోకస్ పెట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి మహిళలు, అమ్మాయిలను రక్షించారు. అయితే అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా షాద్ నగర్ లో వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే?
నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన మూడావత్ తార, ఫరూఖ్ నగర్ మండలానికి చెందిన కమ్మరి వెంకటేశ్ అనే ఇద్దరూ షాదగ్ నగర్ పట్టణంలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఇక ఇక్కడికి కర్నూల్ జిల్లాకు చెందిన బాష అనే వ్యక్తి అమ్మాయిలను పంపిస్తూ తోడ్పాటును అందిస్తుంటాడు. విషయం ఏంటంటే? బాష కొందరు అమ్మాయిలను వెంకటేష్, తార వద్దకు పంపిస్తుంటాడు. వీళ్లు విటుల వద్ద రూ. 1500 చొప్పును ఒప్పందం చేసుకుని చప్పుడు కాకుండా వ్యభిచారాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఏప్రిల్ 9న బిహార్ కు చెందిన ఓ వ్యక్తితో పాటు స్థానికంగా ఉండే మరో యువకుడితో నిర్వాహకులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ గలీజ్ దందాను నిర్వాహకులు గత కొంత కాలంగా నిర్వహిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.
ఇక పక్కా ప్లాన్ తో కదిలిన పోలీసులు షాద్ నగర్ శ్రీనివాస్ కాలనీలో ఉన్న వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించారు. వీరి దాడుల్లో నిర్వాహకులు వెంకటేష్, తార, హసనుల్లాఖాన్, సలీం, సాయికుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా వీరి నుంచి ఓ అమ్మాయిని రక్షించి ప్రజ్వల హోంకు తరలించారు. దీంతో పాటు వీరి నుంచి రూ. 12,500 నగదు, 6 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసును ఛేదించినందుకు శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి పోలీసులను అభినందించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.