సీరియల్ నటుడు దయా అలియాస్ పవిత్ర నాథ్.. మొగలిరేకులు సీరియల్ కనిపించే ఈ మన్మధుడు వరుస అవకాశాలతో సీరియల్ నటుడిగా పేరు ప్రఖ్యాతలు మూటగట్టుకున్నాడు. అయితే సీరియల్ లో బాగా ప్రాచుర్యం పొందిన తర్వాత శశిరేఖ అనే అమ్మాయితో 2009లో ఘనంగా వివాహం చేసుకున్నాడు. కొంత కాలం వీరి వైవాహిక జీవితం బాగానే సాగింది. వీరికి ఓ పాప ఓ బాబు కూడా జన్మించారు.
కానీ గత కొంత కాలం నుంచి జాతకం పేరుతో అమ్మాయిలకు వల వేసి శారీరక సుఖాలను అనుభవిస్తున్నాడని, అమ్మాయిలతో బెడ్ రూంలో తెచ్చుకుని తన కళ్లముందే చేయకూడని దారుణాలు చేస్తున్నాడని దయానాధ్ భార్య శశిరేఖ తన గోడును వెల్లబోసుకుంటుంది. నా భర్త చేస్తున్న ఇలాంటి దారుణంపై నాకు న్యాయం చేయాలని తాజాగా కోర్టు మెట్లెక్కింది శశిరేఖ. గత 11 ఏళ్ల నుంచి నా భర్త చేస్తున్న మోసంపై ఇన్నాళ్లు వేచి చూశానని మార్పు అస్సలు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. రాత్రి పగలు తేడా లేకుండా అమ్మాయిలతో తిరుగుతూ జల్సాలు చేస్తున్నాడని, ఈ విషయంలో అత్తమామలు సపోర్ట్ కూడా నాకు ఇవ్వటం లేదని తెలిపింది దయా భార్య శశిరేఖ.