పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నర్ల వెంకటేష్. రెండు తెలుగు రాష్ట్రల్లో సంచలనంగా మారిన కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని నడిపించింది ఇతడే. ఈ కేసులో పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. అసలేం జరిగిందంటే?
విశాఖపట్నంలో కిడ్నీ రాకెట్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. విశాఖలోని మధురవాడకు చెందిన వినయ్ అనే యువకుడిని నమ్మించి కిడ్నీ తీసుకుని మెసం చేశారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ ఘటనపై ఏపీ పోలీసులు ఫోకస్ పెట్టి కాస్త లోతుగా విశ్లేషించి నిందితులను అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో తీగ లాగితే డొంక కదులుతోంది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన నర్ల వెంకటేశ్ అతడు చేసిన నేరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అసలేం జరిగిందంటే?
ఇతని పేరు నర్ల వెంకటేష్. ఇటీవల సంచలనం సృష్టించిన విశాఖ కిడ్నీ మాఫియాకు ఇతడే ప్రధాన సూత్రదారి. కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రెగలు గ్రామానికి చెందిన వెంకటేష్ చాలా ఏళ్ల కిందట నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ వస్తున్నాడు. మొదట్లో సీడిలు, క్యాసెట్లు అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగించేవాడు. అలా ఇతని వ్యాపారం కొన్నాళ్ల పాటు బాగానే కొనసాగింది. ఈ క్రమంలోనే వెంకటేష్ నీలి చిత్రాల సీడిలను అమ్మడం కూడా మొదలు పెట్టాడు. ఇక దీంతో సరి పెట్టని వెంకటేష్.. ఆర్థికంగా బలంగా మారేందుకు ఇంకా ఏదో చేయాలని తపన పడేవాడు.
ఇక సీడిల కొనుగోలు పేరుతో వెంకటేష్ అప్పుడప్పుడు చెన్నై, విశాఖపట్నం, కాకినాడ వంటి ప్రాంతాలకు వెళ్లేవాడు. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ కు కొంతమందితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఇక వీరితో ఉన్న స్నేహం కారణంగానే వెంకటేష్ తన వ్యాపారాన్ని చివరికి కిడ్నీ రాకెట్ వ్యవహారం వైపు మళ్లించాడు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెట్టుకోవడం వంటివి చేసేవాడు. ఈ పరిచయంతోనే కిడ్నీ అమ్మితే లక్షల్లో డబ్బులు వస్తాయని, దీంతో సెట్ అయిపోవచ్చు అంటూ వారికి లేని పోని ఆశలు కలిగించేవాడు. కిడ్నీ సమస్యతో బాధపడే వారి వద్దకు వెళ్లేవాడు. ఇదే కాకుండా కొన్ని ఆస్పత్రులతో ముందుగానే ఒప్పందం చేసుకుని కిడ్నీలు అమ్ముకుంటూ దోచుకునేవాడు. ఇలా ఒకరిని కాదు, ఇద్దరిని కాదు.. ఏకంగా అనేక మందిని మోసం చేస్తూ కిడ్నీ మాఫియకు బాటలు వేసుకున్నాడు.
ఇక కిడ్నీ అమ్మగా వచ్చిన డబ్బుల్లో కొంత మొత్తంలో వారికి ఇచ్చి పెద్ద మొత్తంలో వెంకటేష్ తీసుకునేవాడు. అలా ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం నడిపిస్తూ వెంకటేష్ పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకున్నాడు. అంతేకాకుండా విలాసవంతమైన కార్లల్లో తిరుగుతూ లగ్జీరి లైఫ్ ను మెయింటెన్ చేసేవాడని తాజా పోలీసులు విచారణలో తేలింది. ఈ సంచలన నిజాలు వెలుగులోకి రావడంతో స్థానిక ప్రజలు, బంధువులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సైతం సీరియస్ అయి నిందితులను కఠినంగా శిక్షించాలాలని హెచ్చరించింది.