మంగళవారం అస్సాం లేడీ సింగం జున్మోని రభా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఆ రిపోర్ట్ లో ఏముందంటే?
అస్సాం లేడీ సింగం జున్మోని రభా మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆమె చావు వార్త రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నీతి, నిజాయితితో విధులు నిర్వర్తించి లేడీ సింగంగా పెరు తెచ్చుకున్న జున్మోని రభా మరణించడంతో ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. వెంటనే పోలీసులు స్పందించి ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ఓ కేసు విషయంలో ఓ ఎమ్మెల్యేతో ఆమె గొడవ పడినట్లుగా సమాచారం. అయితే ఈ క్రమంలోనే ఆమె మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆమె చనిపోయిందా? లేక ఎవరైనా హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారా అంటూ కొందరు అనుమానించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ విడుదలైంది. జున్మోని రభా రోడ్డు ప్రమాదంలో మరణించినప్పటికీ ఆమె వెనుక భాగంలో గాయాలు ఉన్నట్లుగా రిపోర్ట్ లో వెల్లడైంది. రెండు పక్కటెముకలు విరగడంతో పాటు కాళ్లు, మో చేతులపై కూడా గాయాలైనట్లు ఆ రిపోర్ట్ లో తేలింది. ఇదే కాకుండా బ్రెయిన్ హెమరేజ్, కార్డియాక్ అరెస్ట్ కారణంగా జున్మోని రభా మృతి చెందినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెల్లడవ్వడం విశేషం. ఇక ఈ రిపోర్ట్ లో సంచలన నిజలు వెలువడడంతో ఆమె మరణంపై మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. ఇన్ని అనుమానాల నడుమ అసలు ఆమె ప్రమాద ఘటనలో ముందు ముందు ఏం జరగనుందో అనేది కాస్త ఆసక్తిగా మారింది. తాజాగా విడుదలైన జున్మోని రభా పోస్ట్ మార్టం రిపోర్ట్ పై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.