ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయి వివేకా హత్య కేసు రోజుకొక మలుపులు తిరుగుతూ వేడి పుట్టిస్తోంది. గతంలో కొన్ని నెల పాటు ఈ కేసు నీరు గార్చడంతో సీబీఐ మళ్లీ రంగంలోకి దిగింది. ఇక ఈ సారి సీబీఐ విచారణలో ఖంగుతినే నిజాలు బయటకు పొక్కుతున్నాయి. ఇటీవల వివేక ఇంటి వాచ్ మెన్ రంగయ్యను విచారించారు సీబీఐ అధికారులు. రెండు గంటల పాటు జరిగిన ఈ విచారణలో రంగయ్య నమ్మలేని నిజాలను చెప్పాడు.
వివేకా హత్యలో కొందరి కీలక వ్యక్తుల పేర్లు చెప్పాడు వాచ్ మెన్ రంగయ్య. ఈ హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ కుమార్, దస్తగిరికి పేర్లను వెల్లడించారు. ఇక వీరే హత్యకు పాలపడ్డారని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో పాటు హత్యలో మొత్తం 9 మంది పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇక విషయం ఏంటంటే…బయటకు చేప్పబడ్డ పేర్లలోని ఎర్ర గంగిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుండడంతో ఆయనే ఈ హత్యకు ప్రేరేపించినట్లు అనుమానాలు బలపడుతున్నాయి. ఇక నా పేరు బయటకు చెబితే చెంపేస్తానని బెదిరించినట్లు తెలిపారు రంగయ్య.
ఇక వీరి నుంచి తనకు ప్రాణ హాని ఉందని పోలీసులకు తెలిపారు వచ్ మెన్ రంగయ్య. ఈ నేపథ్యంలోనే రంగయ్య ఇంటికి పోలీసులు భద్రతను కలిపించి ఇంటి చుట్టూ కాపలా కాస్తున్నారు. కొత్త కొత్త మలుపులు తిరుగుతున్న ఈ కేసులో ఇంకా సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని సీబీఐ అధికారాలు తెలియజేస్తున్నారు. ఇక రాను రాను ఈ కేసు నుంచి మరికొంత మంది పేర్లు బయటకు రానున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇక రానున్న మరెన్ని వాస్తవాలు వస్తాయో చూడాలి మరి.