మా కొడుకు, కూతురుని జాగ్రత్తగా చూసుకోండి. మేము మీకు డబ్బులు ఇవ్వలేదని వారిని ఏం అనొద్దు. మా అత్తను, అమ్మను బాగా చూసుకోండి. ఎవరూ ఏమన్న పట్టించుకోవద్దు. ఇక మేము వెళ్లిపోతున్నాం అంటూ ఓ దంపతులు ఏడుస్తూ చివరి సారిగా తీసుకున్న సెల్ఫీ వీడియోలో మాటలు ఇవి. అసలు ఏం జరిగిందంటే?
మేము వెళ్లిపోతున్నాం. మా కొడుకు, కూతురుని జాగ్రత్తగా చూసుకోండి. మా కూతురు చాలా అమాయకురాలు. మేము మీకు డబ్బులు ఇవ్వలేదని తనని ఏం అనొద్దు. మా అత్తను, అమ్మను బాగా చూసుకోండి. ఎవరూ ఏమన్న పట్టించుకోవద్దు. ఇక మేము వెళ్లిపోతున్నాం అంటూ ఓ దంపతులు ఏడుస్తూ చివరి సారిగా తీసుకున్నసెల్ఫీ వీడియోలో మాటలు ఇవి. ఇక ఇదే వీడియోను తమ కుమారుడికి పంపి ఫోన్ లు స్విచ్ఛాఫ్ చేసి అప్పటి నుంచి కనిపించకుండాపోయారు. తాజాగా విశాఖలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
విశాఖ పరిధిలోని వడ్లపుడిలో ప్రాంతంలో ఉన్న తిరుమలనగర్ లో చిత్రాడ వరప్రసాద్ (47), మీరా (41) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కూతురు, కుమారుడు సంతానం. వరప్రసాద్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేసేవాడు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి ఈ దంపతులు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే తాజాగా ఈ దంపతులు ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అందులో ఏముందంటే? మేము వెళ్లిపోతున్నాం. మా కొడుకు, కూతురుని జాగ్రత్తగా చూసుకోండి. మా కూతురు చాలా అమాయకురాలు. మేము మీకు డబ్బులు ఇవ్వలేదని దయచేసి తనని ఏం అనొద్దు. మా అత్తను, అమ్మను బాగా చూసుకోండి. ఎవరూ ఏమన్న పట్టించుకోవద్దు. ఇక మేము వెళ్లిపోతున్నాం అంటూ ఆ దంపతులు ఏడుస్తూ చివరి సారిగా వీడియో తీసుకున్నారు.
ఇక అదే వీడియోను ఆ దంపతులు తమ కుమారుడితో పాటు బంధువులకు పంపి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అప్పటి నుంచి కనిపించకుండాపోయారు. ఈ వీడియోను చూసిన ఈ దంపతుల కుమారుడు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే తాజాగా అనాకపల్లి కొప్పాక ఏలూరు కాల్వ వద్ద చెప్పులు, హ్యాండ్ బాగులు, మొబైల్ ఫోన్ లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ దంపతులు నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారా? అసలేమైపోయారనే కోణంలో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఆర్థిక ఇబ్బందులతో సెల్ఫీ వీడియో తీసుకున్న ఈ దంపతుల ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.