అతివేగం కారణంగా నిత్యం అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా ఓ యువతి కారుతో బీభత్సం సృష్టించింది. ఆ వివరాలు..
అతివేగం ఎన్ని అనార్థాలకు దారి తీస్తుందో.. ఎన్ని కుటుంబాలను రోడ్డున పడేస్తుందో లెక్కేలేదు. అతి వేగం కారణంగా ఇప్పటి మన రాష్ట్రంలో ఏటా అనేక మంది మృత్యు వాత పడుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అతివేగంగా కారు నడిపి ఒకరి ప్రాణం తీసింది ఓ యువతి. ఈ విషాదకర సంఘటన సికింద్రాబాద్, అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సదరు యువతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం గమనార్హం. ఇక ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడగా.. ఒకరు మృతి చెందారు. ఆ వివరాలు..
అల్వాల్ సుభాష్‌నగర్‌లో బుధవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన యువతిని కానాజీగూడకు చెందిన శివానీ (26) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా గుర్తించారు. ఇక శివానీ లోబీపీతో బాధపడుతున్నట్లు తెలిపారు. బుధవారం రాత్రి శివానీ తిరుమలగిరి నుంచి మిలటరీ డైరీ ఫార్మ్ వైపు ప్రయాణిస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శివానీ కారు నడుపుతుండగా.. ఓ వ్యక్తి కారుకు ఎదురుగా వచ్చాడు. అతడిని తప్పించే ప్రయత్నంలో శివానీ ఎక్స్‌లేటర్‌పై కాలు పెట్టింది. దాంతో కారు అదుపు తప్పి.. ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటనలో శివానీ కారు ముందుగా ఒక వ్యక్తిని ఢీ కొట్టి.. ఆ తరువాత ఓ రెండు చిన్న షాపులతోపాటు …రెండు టూ వీలర్స్‌ను ఢీకొట్టి.. ఆఖరకి అక్కడే ఉన్నకరెంట్ స్థంభాన్ని బలంగా తగిలింది. దాంతో స్తంభం రెండు ముక్కలుగా విరిగిపోయి.. ఆ పక్కనే బైక్‌పై ఉన్న స్విగ్గి బాయ్‌కి తాకడంతో అతడు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డిన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో ఒక బైక్, చెరుకు రసం బండి, రొట్టేల బండి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. శివానీని అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ ప్రమాదంపై మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి.