సర్పంచ్ తన విధుల్లో భాగంగా తన ఊరి అభివృద్ధి కోసం పాటుపడతాడు. రోడ్లు వేయించడం, కాలువలు తవ్వించడం, చెట్లను నాటించడం, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం వంటి చర్యలు చేపడతాడు. కానీ సిద్ధిపేటకు చెందిన సర్పంచ్ గలీజు పని చేసి వార్తల్లో నిలిచాడు.
గ్రామ స్థాయిలో ప్రథమ పౌరుడు ఎవరు అంటే సర్పంచ్. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధి అయిన సర్పంచ్ తన విధుల్లో భాగంగా తన ఊరి అభివృద్ధి కోసం పాటుపడతాడు. రోడ్లు వేయించడం, కాలువలు తవ్వించడం, చెట్లను నాటించడం, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం, పారిశుధ్య సమస్యలు పరిష్కరించడం, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడటం, పంచాయతీ ఆర్థిక లావాదేవీలు చూడటం వంటి పలు కార్యక్రమాలు చేపడతారు. ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో తమ అభివృద్ధి పనులను సోషల్ మీడియాల్లో పోస్టు చేస్తున్నారు ప్రజా ప్రతినిధులు. అయితే సిద్ధిపేట సర్పంచ్ మాత్రం తన మనస్సులోని ప్రేమను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ స్టేటస్ పెట్టాడు. ఇది గ్రామంలో దుమారం రేగింది. వివరాల్లోకి వెళితే..
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని రంగాయపల్లికి గ్రామానికి చెందిన సర్పంచ్ నాగభూషణం. ఆయన వాట్సప్‌లో ఓ స్టేటస్ పెట్టారు. తన పరువు తాను తీసుకున్నాడు. అసలేమైందంటే.. సర్పంచ్ అత్యుత్సాహం ప్రదర్శించి.. ఓ మహిళ ఫోటోను స్టేటగా పెట్టి.. కింద ఐ లవ్ యూ అంటూ రాశాడు. ఈ స్టేటస్ ఆయన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారంతా చూశారు. ఊరంతా ఈ విషయం పాకింది. చివరకు సదరు మహిళ దగ్గరకు వెళ్లింది. ఆమె భర్తకు కూడా ఈ విషయం తెలిసింది. దీంతో తలెత్తుకోలేక భార్య ఆ ఊరి నుండి వదిలిపెట్టి వెళ్లిపోయింది. సర్పంచ్ తన భార్య పరువు, తన కుటుంబం పరువు తీశాడని మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌లో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అతడు పెట్టిన స్టేటస్ వల్ల తన కుటుంబం తీవ్ర మనస్థాపానికి గురైందని, ఊరిలో ప్రతి ఒక్కరు దీనిపై అడుగుతున్నారని, తలెత్తుకోలేని పరిస్థితికి తెచ్చాడనంటూ, తన సంసారాన్ని నాశనం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సర్పంచ్ నాగభూషణంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అధికారమదంతో సర్పంచ్ నాగభూషణం ఊరిలో మహిళలపై దౌర్జన్యం చేస్తున్నారని, అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని పోలీసులను కోరాడు. ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండాల్సిన సర్పంచ్.. ఇలా ప్రవర్తించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.