హైదరాబాద్ సరూర్ నగర్ లోని పీఎన్టీ కాలనీలో సుబ్రహ్మణ్యం అనే యువకుడు తల్లిదండ్రులతో పాటే నివాసం ఉంటున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి వీరి కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. ఇదే విషయమై సుబ్రహ్మణ్యం స్థానిక కార్పొరేటర్, తన బాబాయ్ కు ప్రశ్నిస్తూ ఎదురు తిరిగాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి సుబ్రహ్మణ్యంను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతనిని కారులో కిడ్నాప్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి కిడ్నాప్ దృశ్యాలు సైతం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అలెర్ట్ అయిన పోలీసులు ఎట్టకేలకు ఆ యువకుడిని రక్షించారు. అనంతరం ఆ యువకుడు మీడియాతో మాట్లాడుతూ సంచలన నిజాలు బయటపెట్టాడు. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు సుబ్రహ్మణ్యం మాటల్లోనే విందాం.
గత కొన్ని రోజుల నుంచి మా కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. ఇదే విషయమై స్థానిక కార్పొరేటర్, మా బాబాయ్ కు ఎదురు తిరిగాను. ఈ సమయంలో గురువారం రాత్రి నేను మా ఇంటికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు నన్ను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. అనంతరం అదే కారులో వెళ్లే క్రమంలో నన్ను తీవ్ర హింసకు గురి చేశారు. ఆ తర్వాత నల్గొండ జిల్లాలోని చింతపల్లి వద్దకు చేరుకున్నాక.. ఓ శివాలయం వద్దకు తీసుకెళ్లి నన్ను స్నానం చేయమన్నారు. ఆ తర్వాత ఒళ్లంత విభూది రాశారు.
ఎందుకు ఇలా చేస్తున్నారంటే.. నిన్ను నరబలి చేస్తున్నామని బెదిరించారు. అనంతరం 12 మంది నన్ను చిత్రహింసకు గురి చేస్తూ కర్రలతో తీవ్రంగా కొట్టారు. నన్ను పాటలు పాడమనడమే కాకుండా, డ్యాన్స్ కూడా చేయమన్నారు. ఆ తర్వాత గంజాయి తీసుకుని సిగరెట్లతో నన్ను ఎక్కడ పడితే అక్కడ కాల్చారు. నా తండ్రి, నేను ఓ మైనర్ బాలికను అత్యాచారం చేసినట్లుగా ఒప్పుకోమని వీడియో రికార్డ్ చేసుకున్నారు. ఇక నన్ను చంపే ప్రయత్నంలోనే ఎస్ ఓటీ టీమ్ వచ్చి నా ప్రాణాలను రక్షించారంటూ సుబ్రహ్యణ్యం తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.